శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గౌ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి.
తిరుమల ,అక్టోబరు 11 : శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల బేడీ ఆంజనేయస్వామి ఆలయం చెరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కి టిటిడి ఈ ఓ జవహర్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి,జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్,టిటిడి అదనపు ఈ ఓ ధర్మారెడ్డి,ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆంజనేయ స్వామి దర్శనం చేయించారు. అనంతరం
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదయాంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.శ్రీవారి దర్శించుకున్న ముఖ్యమంత్రి కి రంగనాయక మండపం నందు టిటిడి డైరీ,కెలాండర్ ను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల తో అశ్వరచనం చేశారు,టిటిడి ఈ ఓ,చైర్మన్ ముఖ్యమంత్రి కి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రంపటంను అందజేశారు.అనంతరం శ్రీవారి గరుడ సేవలో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి చెర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యూలు వెల్లంపల్లి శ్రీనివాసులు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్న బాబు,రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) రాజంపేట తిరుపతి,చిత్తూరు ఎంపి లు, పి.వి.మిథున్ రెడ్డి, ఎం. గురుమూర్తి, యన్. రెడ్డెప్ప, జెడ్ పి చైర్మన్ జి. శ్రీనివాసులు,
తిరుపతి, సత్యవేడు, పలమనేరు, పీలేరు, నగరి,చిత్తూరు ఎమ్మెల్యేలు కరుణాకర రెడ్డి, ఆదిమూలం, వెంకటే గౌడ, చింతల రామచంద్రారెడ్డి,ఆర్ కె.రోజా,అరిణి శ్రీనివాసులు, ఎం ఎల్ సి లు బి. కిశోర్ బాబు,
డి ఐ జి క్రాంతి రాణా టాటా, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్, తిరుపతి ఎస్పీ వెంకట అప్పలనాయుడు,టిటిడి బోర్డు సభ్యులు తదితరులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.
addComments
Post a Comment