అతిక్రమించి మాట్లాడి తరిమికొట్టే పరిస్థితిని తెచ్చుకోవద్దు- అతిక్రమించి మాట్లాడి తరిమికొట్టే పరిస్థితిని తెచ్చుకోవద్దు 


- వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి గుడివాడ, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి): చట్టాన్ని అతిక్రమించి మాట్లాడి తరిమికొట్టే పరిస్థితిని తెచ్చుకోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం గుడివాడ పట్టణం శరత్ థియేటర్లోని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొత్త తరహా రాజకీయాలకు తెర తీసిందన్నారు . గత రెండున్నరేళ్ళుగా రాష్ట్రంలో అలజడి సృష్టించి అశాంతికి కారణమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి రావాలన్న కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబుకు కుట్ర రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గతంలో మల్లెల బాబ్దితో ఎన్టీఆర్ను చాకుతో పొడిపించారన్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలు చేసినట్టుగా అలజడులు సృష్టించారన్నారు. తాజాగా ఒక పెంపుడు కుక్కను తయారు చేసుకుని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, మంత్రులపై రోజువారీ ఏదో ఒకటి మొరిగించడం చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే సీఎం జగన్మోహనరెడ్డిని నోటికొచ్చినట్టుగా మొరిగారన్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులు కారని, పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవి  నారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకట లక్ష్మి, నాయకులు తులిమిల్లి యేషయ్య, నైనవరపు శేషుబాబు, తోట రాజేష్, షేక్ బాజీ, మెండా చంద్రపాల్, మామిళ్ళ ఎలీషా, వెంపటి సైమన్ తదితరులు పాల్గొన్నారు.

Comments