గ్రామాభివృద్ధి లోను దాతలు స్ఫూర్తి గా నిలుస్తున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.కొవ్వూరు  (ప్రజా అమరావతి);విద్యార్థుల కు మెరుగైన విద్యా ను అందించే దిశలో డిజిటల్ తరగతుల నిర్మాణంలో, గ్రామాభివృద్ధి లోను  దాతలు స్ఫూర్తి గా నిలుస్తున్నారని  రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.స్థానిక పసివేదల లోని జెడ్పి హైస్కూల్ ఆవరణ రూ.5 లక్షల తో అవంతి ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన డిజిటల్ తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం వేములూరు లో పంచాయతీ కి ట్రాక్టర్ ను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి వంటి పథకాలను ప్రవేశపెట్టి పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేల ఒక మేనమామ లా ఆలోచించి అండగా నిలిచారన్నారు. కేవలం అంతటితో ఆగకుండా విద్యా కానుక,  మధ్యాహ్న భోజన పధకం , వసతి దీవెన వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని తరగతులు నిర్మాణాలు, మరమ్మత్తులు, గ్రీన్ బోర్డ్, బెంచీలు, పాఠశాల ల ప్రాంగణాలు ఆహల్లాదకరంగా తీర్చిదిద్దడం చేస్తున్నామని మంత్రి తెలిపారు. నాడు నేడు కింద చేపట్టని డిజిటల్ తరగతి గదులను దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంద్రకుమార్ వంటి దాతలు గ్రామాభివృద్ధి తో పాటు, పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటు కు ముందుకు రావడంతో మంత్రి అభినందించారు.


స్వచ్చంద్ర ప్రదేశ్ స్పూర్తితో ఉద్యమిద్దామని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత కు వ్యక్తి గత బాధ్యత వహించాలని మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు. వ్యర్థ లను ఇష్టానుసారంగా రోడ్డుపై న, ఖాళీ ప్రదేశాల్లో వెయ్యకుండా సామాజిక బాధ్యత వహించాలన్నారు. ఇంటికి చెత్త సేకరణ కోసం వొచ్చే వారికి అందించాలన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా14 వేల గ్రామ పంచాయతీ లకు దశల వారీగా ట్రై సైకిల్స్ తో కూడిన చెత్త సేకరణ వాహనాలు అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వెస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ లను ఏర్పాటు చేసి వ్యర్ధాల నుంచి సంపద సృష్టించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.వేములూరు పంచాయతీ కి రూ.10 లక్షల ఖరీదైన ట్రాక్టర్ బహుకరించిన ఇంద్రకుమార్వేములూరు గ్రామాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా నిధులను అందించిన స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా అవంతి ఇంద్రకుమార్  రూ.10 లక్షలు ఖరీదైన ట్రాక్టర్ అందించారని, అదే సమయంలో గ్రామంలో రహదారి నిర్మాణం కోసం ముందుకు వొచ్చారని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గతంలో గ్రామంలో త్రాగునీటి పథకం ఏర్పాటు చెయ్యడం ఆయన సేవానిరతికి నిదర్శనం అన్నారు.  పంచాయతీ కి అందచేసిన ట్రాక్టర్ నిర్వహణ బాధ్యత సమిష్టిగా తీసుకోవాలని మంత్రి  తెలిపారు. 


పసివేదల కార్యక్రమానికి పసివేదల సర్పంచ్ తుంపల్లి సింహాచలం అధ్యక్షత వహించారు. ఎంపిపి కాకర్ల నారాయుడు, ఎంపిటిసి లు నూతంగి రేఖ, కర్రిమజ్జి బాలకృష్ణ, అవంతి ఫౌండేషన్ ఛైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ ఎంపీడీఓ పి. జగదాంబ, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


వేములూరు లోని కార్యక్రమానికి వేములూరి సర్పంచ్ అరేపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఎంపిపి కాకర్ల నారాయుడు, స్థానిక నాయకులు కోటికలపూడి అబ్రహం,ఎంపిడిఓ  పి. జగదాంబ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.