సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపైన్ లో కాకాణి.

 "సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపైన్ లో కాకాణి.



శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని చంద్రమౌళి నగర్ యస్.టి.కాలనీలో "సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపైన్" లో పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఇంటింటికీ తిరిగి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీసిన ఎమ్మెల్యే కాకాణి.


ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తమకు సక్రమంగా అందుతున్నాయంటూ, సంతృప్తిని వ్యక్తం చేసిన ప్రజలు.


సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సక్రమంగా పనిచేస్తున్నారని గ్రామస్తుల కితాబు.


స్థానిక పాఠశాలను సందర్శించి, నాడు-నేడు పథకం ద్వారా జరిగిన అభివృద్ధి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి.


కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు.




 ప్రతి ఇంటి ముంగిటకు అధికారులను పంపించి, పాలన వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ప్రజలు నూటికి నూరుశాతం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.


 వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పక్షపాత వైఖరి అవలంభించకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి.


 సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తమకు విశేష సేవలు అందిస్తున్నారని ప్రజలు మెచ్చుకుంటున్నారు.


 ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల్లో పూర్తిస్థాయిలో సిమెంటు రోడ్ల నిర్మాణం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


 స్థానికంగా పాడు పడిపోయిన పాఠశాలలు నాడు-నేడు పథకం ద్వారా రూపురేఖలు మారిపోవడంతో పిల్లలకు, తల్లిదండ్రులకు అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది.


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న విధానాన్ని బట్టి ప్రజాప్రతినిధులు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు.


 చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి, అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు.


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, అర్హులైన వారందరికీ సమర్థవంతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు.


 జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక, చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై దుష్ప్రచారానికి దిగుతున్నాడు.


 నియోజకవర్గాలలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు చంద్రబాబు పాలనను ఛీ కొడుతూ, జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు.


 సర్వేపల్లి నియోజకవర్గంలో సమర్థవంతంగా పని చేస్తున్న అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు తప్పనిసరిగా అమలు చేస్తాం.

Comments