విజయగాధ
కొవ్వూరు (ప్రజా అమరావతి);
వైఎస్సార్ ఆసరా.. ఇచ్చింది ఆర్థిక భరోసా.
4 విడతల్లో డ్వాక్రా బ్రుణ మాఫీ జరుగుతోంది. బి నాగలక్ష్మి
జగనన్న ఒక ఆలోచన ...మహిళలు కోసం ఒక అన్నగా, పిల్లలకు మేనమామ లా అనునిత్యం సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుని రావడం ఎంతో ఆనందంగా ఉందని భువనగిరి నాగలక్ష్మి తెలిపారు.
కొవ్వూరు మండలం కుమారదేవరం గ్రామానికి చెందిన బి. నాగలక్ష్మి ప్రభుత్వం అందించిన వివిధ పథకాల ద్వారా పొందిన లబ్ది ఆమె మాటల్లో...
జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత తనకు, తన కుటుంబానికి 29 నెలల్లో లక్షా ఇరవై ఎనిమిది వేలు మేర ఆర్ధిక ప్రయోజనం చేకూరిందని భువనగిరి నాగలక్ష్మి పేర్కొన్నారు.
2011 లో స్వయం సహాయక సంఘం సభ్యురాలిగా చేరడం జరిగిందన్నారు. గ్రూపులో ఉంటే ఎంతో మేలు జరుగుతుందని తెలియడం తో గ్రామ సంఘం నాయకుల సలహాలతో లక్ష్మీదేవి గ్రూపు లో సభ్యురాలిగా చేరిన నేను, ప్రస్తుతం అధ్యక్షరాలిగా ఉన్నాను.
గతంలో ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వం వచ్చాకా గత రెండున్నర ఏళ్ల కాలంలో స్వయం సహాయక సంఘ సభ్యులకు జరిగిన మేలు ఎంత చెప్పినా తక్కువే. రాష్ట్రంలో మహిళా సంక్షేమ పాలన సాగుతోందని చెప్పగలుగుతున్నాను.
సంఘ సభ్యురాలిగా నాకు జరిగిన మేలు .... మా లక్ష్మీ దేవి గ్రూపు కి జగనన్న తోడు కింద లక్ష రూపాయలు, వైఎస్సార్ ఆసరా గా రెండో సారి లక్షా ఎనభై వేలు, స్త్రీ నిధి ద్వారా రెండు లక్షలు, బ్యాంక్ లింకేజిగా ఎనిమిది లక్షల రూపాయల వొచ్చిందని నాగలక్ష్మి తెలిపారు. వాటి ద్వారా తనకు చేరిన ప్రయోజనం లక్షా ఇరవై ఎనిమిది వేలు వొచ్చిందన్నారు. ఇవి కాకుండా ఈ ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.15 వేలు, అమ్మఒడి ద్వారా రూ.15 వేలు, న భర్త ఆటో డ్రైవర్ కి మరో 10 వేలు అందించారన్నారు. మా పిల్లల కు జగనన్న విద్యా కానుక కిట్లు, నాడు నేడు పాఠశాలలు రూపురేఖలు పూర్తిగా మారిపోయి, మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవడం వంటివి ఎన్నో ఉన్నాయన్నారు. మా స్వగ్రామాల దగ్గరే లక్షలు ఖరీదు చేసే సొంత ఇల్లు కోసం గజన్నార ఇంటి స్థలం ఇచ్చిన జగనన్న రుణం తీర్చుకోలేనని నాగలక్ష్మి తెలిపారు.
జగనన్న ప్రభుత్వం కల్పించిన భరోసాతో స్వంత వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టి ప్రతినెలా స్థిరంగా రూ.5 వేలు ఆదాయం వొస్తోందని నాగలక్ష్మి తెలిపారు. నా తోటి సంఘ సభ్యురాళ్లు సూచనలు నాకెంతో ఆసరా ఇచ్చిందన్నారు. 2014 లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పడంతో మా గ్రూపు సభ్యుల వాయిదా లు చెల్లించవద్దని చెప్పి, మేము డి గ్రూపు కి వెళ్ళమని, జగనన్న పాదయాత్ర లో తాను కలిసినట్లు నాగలక్ష్మి తెలిపారు. మీరు తీసుకున్న అప్పును చెల్లించండి, నేను అధికారంలోకి వొచ్చకా 4 విడతల్లో మీరుణం తిరుస్తాను అని చెప్పారు. ఆనాడు జగనన్న ఇచ్చిన మాటపై మా సంఘ సభ్యులం అప్పును తిరిగి చెల్లించడం ప్రారంభించాము. ఈరోజు ఆసరా ప్రయోజనం ద్వారా లబ్దిని పొందగలుగుతున్నాము.
మాట తప్పడు.. మడమ తిప్పని నాయకుడు జగనన్న.. ఆసరా ద్వారా వరుసగా రెండో ఏడాది మాఖాతా లో వై ఎస్సార్ ఆసరా 2వ విడత రూ.18,300 లు సొమ్ము జమచేసారని నాగలక్ష్మి తెలిపారు.
addComments
Post a Comment