*తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ప్రారంభించిన చంద్రబాబు*
గుంటూరు (ప్రజా అమరావతి) : చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా రాష్ట్రంలో ఏర్పడ్డ అనేక టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అపారమైన ఉద్యోగావకాశాల ఫలితంగా లబ్ధి పొంది, ఉన్నత స్థానాలకు ఎదిగిన ఆంధ్ర యువత, నేడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్రంగా కలత చెంది ఉన్నారు. తాము ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తమ మాతృభూమి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకత్వాన్ని నిలువరించి, మరలా ఆంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్ర మార్చటానికి చంద్రబాబు నాయకత్వం అత్యవసరమని భావించి, తాము సైతం అందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేస్తామని తమకు అవకాశం కల్పించమని చంద్రబాబును కోరారు. ఈ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం తమవంతు గా కృషి చేయాలనుకుంటున్న యువత కోసం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి దానిద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రొఫెషనల్స్ కు, తమ సమయానుకూలంగా రాష్ట్ర అభ్యున్నతికై పోరాడటానికి వేదికను కల్పించారు. మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జన్మదినమైన, శుభదినం అక్టోబర్ 2న ఈ వేదికను లాంఛనంగా ప్రారంభించారు. అదే స్ఫూర్తితో చిన్న వయసులోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సమాజహితమైన కార్యక్రమాలతో, భామి ఫౌండేషన్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మహిళా నాయకురాలు తేజస్వి ని పొడపాటి అధ్యక్షురాలిగా నియమించి ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా తేజస్విని పొడపాటి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మహాత్మా గాంధీ జన్మదినం రోజు ఈ విభాగాన్ని ప్రారంభించటం సంతోషంగా ఉందని, ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని యువత తమ తమ హక్కుల కోసం భావితరాల ఉజ్వలభవిత కోసం రాజకీయాలను వేదిక చేసుకోవాలని మరింతమంది మేధావంతులు, సమర్థులు అయిన యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ప్రధాన కార్యదర్శులు గడ్డం మహేంద్ర, కనకమేడల వీరాంజనేయులు పాల్గొన్నారు.
addComments
Post a Comment