మహర్షి వాల్మీకి భావితరాలకు మార్గదర్శకులై చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిన

 ప

 నెల్లూరు, అక్టోబర్ 20  (ప్రజా అమరావతి):---మహర్షి వాల్మీకి భావితరాలకు మార్గదర్శకులై చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిన


గొప్ప  మహనీయులని కొనియాడుతూ వారి ఆశయాలను,మార్గ నిర్దేశకాలను అందరూ ఆచరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి చక్రధర బాబు కోరారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా బుధవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవునిగా జన్మించినప్పటికీ మహర్షి గా మారడానికి ఎవరికైనా సాధ్యపడుతుందని మహర్షి వాల్మీకి నిరూపించారన్నారు.  మానవులు భగవంతునిగా కీర్తింప పడతారని మహర్షి వాల్మీకి జీవిత చరిత్ర చూస్తే అర్థం అవుతుందన్నారు.  మనం చేసే పనులు, నడవడిక బట్టి, జీవన విధానం బట్టి భగవంతుడు గా మారవచ్చన్నారు.  భగవంతుడు మానవ రూపేన ఉంటాడని నిరూపించిన ఎంతోమంది మహనీయులు పుణ్యభూమి భారత దేశంలో నడయాడారన్నారు. వాల్మీకి జీవితంలో బోయ వాడి నుంచి మహాకావ్యం రామాయణాన్ని సంస్కృతం లో రచించే వరకు ఆయన మారిన తీరు చూస్తే అప్పుడు  సమాజంలో వున్న రుగ్మతలు ఎలా పోగొట్టుకోవాలో తెలుస్తుందన్నారు.   ప్రతి మానవుడు ఆదర్శవంతమైన జీవితం ఎలా గడపాలో శ్రీ రాముని వర్ణన ద్వారా అర్థం అవుతుందన్నారు. స్త్రీ మూర్తి ఎలా ఉండాలి అనే విషయం సీతామహాదేవి ద్వారా తెలియ చెప్పారన్నారు. కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉండాలి, మానవ జీవితం ఎలా ఉండాలి, స్నేహం ఎలా ఉండాలి, మంచి నడవడిక ఎలా ఉండాలి, సమాజంలో పోరాడే శక్తి ఎలా వస్తుంది అనే అంశాలపైనా మనకు  శ్రీ రామాయణ కావ్యంలో విశదీకరించారన్నారు.   ఎంతో గొప్ప రావణ సామ్రాజ్యాన్ని వానరులతో వెళ్ళి ఒక మానవుడు విజయం సాధించాడన్నారు.   చెడుపై మంచి విజయం ఎప్పటికైనా ఎంత చిన్న ప్రయత్నం అయినా ప్రారంభించాక దానంతట అదే విజయం వైపు దూసుకెళుతోందనే విషయం మహాభారతం,  రామాయణం మహాకావ్యాలు తెలియజేస్తున్నాయన్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలు కుటుంబం, సమాజం పట్ల గుర్తెరిగి మంచి జీవనాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా గ్రంధాలు దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు. రామాయణం వంటి మహా కావ్యాన్ని అందించి ప్రపంచానికే ఆదికవి గా నిలిచిన మహర్షి వాల్మీకికి అందరూ ఘన నివాళులు అర్పించాలన్నారు. ఆయన ఆశయాలను, మార్గనిర్దేశం తూచా తప్పకుండా పాటించాలన్నారు.  అంతకుమునుపు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చిన్న ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగ జరుపుతున్నామన్నారు. మహర్షి వాల్మీకి అసలు పేరు రత్నాకరుడని,  ఆయన అడవిలో పక్షులు,  జంతువుల వేట ద్వారా జీవనం సాగించే వాడని, అనంతరం దారి దోపిడీ దొంగ గా మారి  బాటసారులను దోచుకునేవాడన్నారు. కాలక్రమేణా నారద ముని సలహా రామనామ స్మరణతో తపస్సుచేసి వాల్మీకి మహర్షి గా  మారారన్నారు. రామాయణాన్ని 23000 పద్యాలతో రచన చేసి భారతావనిలో ఆదికవిగా నిలిచారన్నారు.  ఈ కార్యక్రమంలో లో సంయుక్త కలెక్టర్ లు శ్రీ గణేష్ కుమార్,  శ్రీవిదెహ్ ఖరే, శ్రీమతి రోజ్ మాండ్,  బీసీ సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య,  జడ్పీ సీఈఓ శ్రీనివాస రావు,  డి టి సి శ్రీ చందర్ ,డి పి ఓ శ్రీమతి ధనలక్ష్మి, గృహనిర్మాణ సంస్థ, డ్వామా  పి డి లు శ్రీ వేణుగోపాల్, శ్రీ తిరుపతయ్య,  డి.ఎస్.ఒ శ్రీ వెంకటేశ్వర్లు, కార్మిక శాఖ డి సి శ్రీ వెంకటేశ్వర్లు, తదితర జిల్లా అధికారులు,  వాల్మీకి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ నల్ల పోతుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి శ్రీ బీసీ కోటయ్య,  జిల్లా కమిటీ నాయకులు శ్రీ వెంకటసుబ్బయ్య, శ్రీ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Comments