*డిశంబర్ చివరి నాటికి గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణ పనులు పూర్తి*
*అస్తవ్యస్త డివైడర్ ల తొలగింపు పనుల ప్రారంభం లో ఆడిషినల్ కమిషనర్ హేమమాలిని*
*నృసింహుని సింబల్ వచ్చేలా డివైడర్ మధ్యలో లైటింగ్ ఏర్పాటు చేస్తామని స్వష్టీకరణ*
మంగళగిరి (ప్రజా అమరావతి); డిసెంబర్ నెల చివరి నాటికి గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని అడిషనల్ కమిషనర్ హేమమాలిని స్పష్టం చేశారు. మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని గౌతమ బుద్ధ రోడ్డుపై ఆర్ అండ్ బి బంగ్లా వద్ద డివైడర్ తొలగింపు పనుల్ని ఆమె శుక్రవారం రాత్రి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రహదారిపై డివైడర్ అస్తవ్యస్తంగా ఉన్నందున వాటిని తొలగించి రూ.కోటి వ్యయంతో నూతన డివైడర్ ను నిర్మించనున్నట్లు చెప్పారు. రహదారి మధ్యలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి సింబల్ వచ్చేలా లైటింగ్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.డివైడర్ తొలగింపు పూర్తి చేసి బిటి రోడ్డు పనుల్ని ప్రారంభిస్తామని అన్నారు. రహదారిని రూ 10 కోట్ల వ్యయంతో విస్తరిస్తున్న ట్లు ఈ సందర్భంగా హేమమాలిని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment