అమరావతి (ప్రజా అమరావతి);
*ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో ఐఐటీ ర్యాంకులు సాధించిన విద్యార్ధులను క్యాంప్ కార్యాలయంలో అభినందించి వారికి ల్యాప్‌టాప్‌లు బహుకరించిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి(గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే ఇతర ఉన్నతాధికారులు.*
*ఈ సందర్భంగా ఐఐటీ సహా ఇతర ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్ధుల అభిప్రాయం వారి మాటల్లోనే....*
*వరలక్ష్మి, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, మారికవలస, విశాఖపట్నం జిల్లా.*
మాది కోటపర్తి వలస గ్రామం, అనంతగిరి మండలం, విశాఖపట్నం జిల్లా.
ఎస్టీ కేటగిరీలో నాకు 596 వచ్చింది.
నేను ఈ ర్యాంకు సాధించడానికి ప్రత్యేకంగా మీరే(సీఎం శ్రీ వైయస్.జగన్) నాకు స్ఫూర్తి సర్. ఎందుకంటే మాకులానే చదువుకోవాలనే ఆశ ఉన్నవాళ్ల కోసం స్వర్గీయ డాక్టర్ రాజశేఖరరెడ్డి గారు గిరిజన సంక్షేమ సంస్ధలను ఏర్పాటు చేశారు. ఈ విషయంలో నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే మీరు నాలుగు అడుగులు ముందుకు వేశారు.
అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద వంటి పథకాలు మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. కరోనా కష్టకాలంలో కూడా మేము మా జగన్ సర్ ఉన్నారు అనే ధైర్యంతో మేం చదువుకోగలిగాం. అన్నదానం ఆకలి తీర్చగలిగితే విద్యాదానం అజ్ఞానాన్ని తొలగిస్తుందన్న మీ ఆశయం చాలా గొప్పది. కాబట్టి విద్య కొరకు ఎన్ని కోట్లైనా మీరు ఖర్చుపెడుతున్నారు. ఇంకా పైస్ధాయికి వెళ్లి సివిల్స్ సాధించి నాలాంటి ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి మంచి గైడ్‌గా ఉండాలని ఆశిస్తున్నాను. దానికి మీ పూర్తి సహాయ,సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
*పార్ధసారధి, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం,విజయనగరం జిల్లా.*
ఆలిండియా ఐఐటీ ఎస్టీ కేటగిరీలో నాకు 333 ర్యాంకు వచ్చింది. మాది విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామం. మా తల్లిదండ్రులు వెదురుబుట్టులు అల్లుతారు. నేను చిన్నప్పటి నుంచి ట్రైబల్ వెల్ఫేర్ రెషిడెన్సియల్ స్కూల్‌లోనే చదివాను. ఆ స్కూల్స్‌లో చదవడం వల్ల సోసైటీలో ఎలా మెలగాలనేది మాకు మా గురువులు నేర్పారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో ఈ స్కూల్స్ బాగా అభివృద్ధి చెందాయి. సీఎం సర్... మాకు మీరే స్ఫూర్తి. ఎందుకంటే విద్యార్ధులే అభివృద్ధికి మూలమని మా కోసం మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి వంటి మంచి కార్యక్రమాలు చేపట్టి మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. మనబడి నాడు–నేడు గురించి చెప్పుకుంటే... ఒక విద్యార్ధికి మంచి విద్యాభ్యాసం ఎంత అవసరమో... చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం కూడా అంతే అవసరం. మీరు ప్రారంభించిన మనబడి నాడు–నేడుతో మా కాలేజీ రూపురేఖలే మారిపోయాయి. చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని మీరు మాకు కల్పించారు. అందుకు మా విద్యార్ధులందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
*భానుప్రసాద్, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, పార్వతీపురం.*
నాకు ఆలిండియా ఐఐటీ ఎస్టీ కేటగిరీలో 662 ర్యాంకు వచ్చింది. అమ్మా, నాన్న ఇద్దరూ నిరక్షరాస్యులు, దినసరి కూలీలు. మా విద్యాభివృద్ది కోసం మీరు విద్యాకానుక, అమ్మఒడి, విద్యాదీవెన లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. మీకు ధన్యవాదాలు. నేను కూడా భవిష్యత్తులో గిరిజన సంక్షేమం కోసం పనిచేస్తాను.
*బి తరుణ్, గణపవారి గూడెం, లింగపాలెం మండలం.*
ఆలిండియా ఎస్సీ కేటగిరీలో 507 ర్యాంకు వచ్చింది.
నేను సోషల్ వెల్ఫేర్ ఎల్ బి చర్ల, నర్సాపురంలో చదవుకున్నాను. పశ్చిమగోదావరి జిల్లాలో స్ఫూర్తి కార్యక్రమం మాకు ఎంతో ఉపయోగపడింది. మంచి కోచింగ్ అందించారు. నాడు–నేడు ద్వారా మా కాలేజ్ చాలా అభివృద్ధి చెందింది.
*వై రఘు, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*
ఎస్సీ కేటగిరీలో జేఈఈ అడ్వాన్స్‌లో 838 వచ్చింది.
ఇలా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. మా ఉపాధ్యాయుల శిక్షణ, ప్రభుత్వం కల్పించిన మంచి మౌలిక సదుపాయాల వల్లే నాకు ఈ ర్యాంకు సాధ్యమైంది. ధన్యవాదాలు సర్.
addComments
Post a Comment