గుడ్ మార్నింగ్ వాడ పల్లి

  కొవ్వూరు (ప్రజా అమరావతి);

ప్రజా సమస్యల పరిష్కారానికై నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు రూపొందించిన కార్యక్రమమే గుడ్ మార్నింగ్ వాడ పల్లి


అని కొవ్వూరు మండల పరిష త్ ప్రెసిడెంట్ కాకర్ల నారాయణ అ న్నారు. సోమవారం కొవ్వూరు వాడ పల్లి గ్రామం లో గుడ్ మార్నింగ్ వా డపల్లి కార్యక్రమాన్ని ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తు న్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేందుకు గుడ్ మార్నింగ్ వా డపల్లి కార్యక్రమం ద్వారా ప్రజలనే నేరుగా సమస్యలను అడిగి తెలు సుకుని సంబంధిత అధికారుల దృ ష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కా రానికై కృషి చేయడం జరుగుతుం దన్నారు గ్రామంలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయా లని కోరారు.

 ఈ కార్యక్రమంలో వాడపల్లి గ్రామ సర్పంచ్ గెల్లా ప్రసాద్, వాడపల్లి ఎంపీటీసీ, ఇంజేటి మౌనిక, ఉప సర్పంచ్ లంకదాసు సముద్రరావు, నాయకులు, సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.