బద్వేలు ఉపఎన్నికలో కాంగ్రెస్ పోటీ: శైలజనాధ్

 బద్వేలు ఉపఎన్నికలో కాంగ్రెస్ పోటీ: శైలజనాధ్

గుంటూరు (ప్రజా అమరావతి): బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాధ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడానికి.. ప్రజలోకి వెళుతున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో కడప జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగాయో చూశామన్నారు. దౌర్జన్యాలకు, దాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు. రాష్టంలో పరిపాలన రోజు రోజుకీ దారుణంగా మారుతోందని, అప్పుల బాధతో ప్రభుత్వం తలమునకలు అవుతోందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయన్నారు. బీజేపీని ప్రశ్నించలేని అసమర్థతలో ఏపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి బద్వేలులో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. విశాఖ ఉక్కు, ప్రభుత్వ ఆస్తులు ప్రవేటీకరణ ఆపాలంటే.. అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని శైలజనాధ్ అన్నారు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image