చారిత్రిక ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నా

  కొండవీడు (ప్రజా అమరావతి);    జిల్లా కలెక్టర్ శ్రీ వివేక్ యాదవ్  కుటుంబ  సమేతంగా కొండవీడు కోట ను సందర్శించారు. ఘాట్ రోడ్ మీదుగా కోటకు చేరుకొని కోట ఎంట్రెన్స్ లోని నగరవనం అభివృద్ధిలో భాగంగా అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన వనదేవత విగ్రహాన్ని మరియు  ఆర్చ్ లేదా ద్వారాన్ని పరిశీలించారు. ఘాట్ రోడ్డు పరిశీలించి ఘాట్ రోడ్డు ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణానికి అనుకూలంగా ఉందని కొనియాడారు. తరువాత ఈ వారంలో నిర్మాణం చేపట్టబోతున్న 0.75 కిలోమీటరు ఘాటు  రోడ్డును పరిశీలించారు. పక్కనే ఉన్న మహద్వారం గా పిలవబడే తూర్పు ద్వారాన్ని చూసి దాని చారిత్రిక ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నా


రు. తరువాత వాహనాలు నిలిపే పార్కింగ్ ఏరియా ను చిల్డ్రన్స్ ప్లే ఏరియా తరువాత యోగివేమన మండపం నూతనంగా నిర్మించబడిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మసీదు, గుర్రపు శాల,మూడు చెరువులను (పుట్టలమ్మ ముత్యాలమ్మ వెదుళ్ళ )చూసి వాటి పేర్లను అడిగి తెలుసుకున్నారు . వెదుళ్ళ చెరువు ఒడ్డున కొండ పైన ఉన్న నెమళ్ల బురుజును దాని చారిత్రక ప్రాధాన్యత ను అడిగి తెలుసుకున్నారు. తరువాత నేతి కొట్టు ను సందర్శించి నేతికొట్టుకు ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని చర్చించారు. నేతి కొట్టు పూర్వం రెడ్డి  రాజులు కొండ బండ లో 18 అడుగుల పొడవు, 12 అడుగులు వెడల్పు,6 అడుగులు  లోతు  గలిగిన నిర్మాణంలో నేతిని  నిలువ చేశారని చెబుతారు. అయితే కొంతమంది చరిత్రకారులు ఇక్కడ ఆరోజు ఆయుధాలకు వాడిన రసాయనాలను ఇందులో కలిపారని, ఇంకొక వాదన ఇక్కడ రాత్రి పహారా కాసే టందుకు దివిటీల లో వాడిన నూనెను నిల్వ చేశారని చెబుతారు. తరువాత కొండవీడులో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట అటవీశాఖ అధికారులు, కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి, పర్యాటక శాఖ ఉద్యోగులు, రెవిన్యూ శాఖ సిబ్బంది,అవుట్ rival ట్రెక్కింగ్ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు.

Comments