*జలవనరులశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
అమరావతి (ప్రజా అమరావతి):
*పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు*
దిగువ కాపర్ డ్యాం పనులు, కెనాల్స్‌కు కనెక్టివిటీ తదితర అంశాలపై చర్చ
ఆర్ అండ్ ఆర్ పనులపైనా సమీక్షించిన సీఎం
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయింబర్స్ చేయాల్సిన నిధులకు సంబంధించి సీఎంకు వివరాలందించిన అధికారులు
పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం రీయింబర్స్ చేయాల్సిన డబ్బు రూ.2033 కోట్లకు పైనే ఉందని తెలిపిన అధికారులు
కేంద్రం నుంచి వెంటనే తెప్పించుకునేలా ప్రయత్నాలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు రీయింబర్స్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎం ఆదేశం
గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ పనులను పూర్తి చేశామని సీఎంకు వివరించిన అధికారులు
ఎగువ కాపర్ డ్యాం పనులను పూర్తి చేసి, వచ్చే ఖరీప్ నాటికి కాల్వల ద్వారా నీరందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన అధికారులు
దిగువ కాపర్ డ్యామ్ పనులను నవంబరు నాటికి పూర్తి చేసి, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్) పనులను ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపిన అధికారులు
*ఇతర ప్రాజెక్టుల ప్రగతినీ పరిశీలించిన సీఎం*
– నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి. నవంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమని వెల్లడించిన అధికారులు
– అవుకు టన్నెల్ నిర్మాణ పనుల్లో గణనీయ ప్రగతి సాధించామన్న అధికారులు
– ఫాల్ట్‌జోన్‌లో తవ్వకాలు జరిపి.. పటిష్టపరిచే కార్యక్రమాలను చురుగ్గా చేపడుతున్నామన్న అధికారులు
– వచ్చే ఆగస్టు నాటికి టన్నెల్ పూర్తిచేసి ఆ టన్నెల్ ద్వారా నీటిని ఇవ్వగలుగుతామని తెలిపిన అధికారులు
– పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
పనుల్లో ఆలసత్వం ఉండొద్దన్న సీఎం.
*వెలిగొండ ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష*
– రెండో టన్నెల్ పనుల వేగం పెంచాలని సీఎం ఆదేశం.
– వంశధార స్టేజ్ –2 ఫేజ్ –2 పనులన్నింటినీ కలిపి వచ్చే మే నాటికి పూర్తి చేస్తామన్న అధికారులు.
– నిర్దేశించుకున్న సమయానికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం.
– నేరడివద్ద బ్యారేజీ నిర్మాణంకోసం కూడా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
– ఒడిశా రాష్ట్రంతో చర్చలకోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం.
– తోటపల్లి బ్యారేజీకింద పూర్తిస్థాయిలో వచ్చే ఖరీఫ్‌నాటికి నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
– వెంటనే పనులు పూర్తిచేయాలన్న సీఎం.
– మహేంద్ర తనయను పూర్తిచేయడంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం.
– ఈ పనులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్న సీఎం.
– గులాబ్ తుపాను, అనంతర వర్షాల కారణంగా ఎక్కడైనా ఇరిగేషన్ కాల్వలు దెబ్బతింటే వాటిని బాగుచేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.
– కొల్లేరు వద్ద గోదావరి మరియు కృష్ణా డెల్టాలలో రెగ్యులేటర్ నిర్మాణ పనులను ప్రాధాన్యాతా క్రమంలో చేపట్టాలని సీఎం ఆదేశం
నిర్మాణంపైన దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం.
– తాండవ ప్రాజెక్టు విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం.
తాండవ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లను పిలిచామన్న అధికారులు, తొలివిడత టెండర్ల ప్రక్రియలో అధికంగా కోట్ చేసిన పనులకు సంబంధించి మరోసారి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని తెలిపిన అధికారులు
ఈ సమీక్షా సమావేశానికి జలవనరులశాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, జలవనరులశాఖ ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్ధల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment