డ్రగ్స్ విషయంలో పోలీసులవి తప్పుడు ప్రకటనలు : టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర

 డ్రగ్స్ విషయంలో పోలీసులవి తప్పుడు ప్రకటనలు : టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర

అమరావతి (ప్రజా అమరావతి)


: పోలీసులు డ్రగ్స్ విషయంలో ఉద్దేశపూర్వంకంగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర అన్నారు. వైసీపీ నాయకులను కాపాడేందుకు డీజీపీ, విజయవాడ సీపీ తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. విజయవాడ కేంద్రంగానే హెరాయిన్ వ్యాపారం జరిగింది అనడానికి ఆశి ట్రేడింగ్ సుధాకర్ సంస్థ కట్టిన జీఎస్టీలే రుజువన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన డీజీపీ హెరాయిన్ విషయంలో వైసీపీ నాయకులను కాపాడటం సిగ్గుటని మండిపడ్డారు. గత నెల 20 న హెరాయిన్ పట్టుబడితే నిన్న సీఎం ఆ అంశంపై మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఏపీ గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందన్నారు. ఏపీలో గంజాయి సాగులో వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఒక పెద్ద మాఫియా ఏపీలో నడుస్తోందన్నారు. కాకినాడలో ఎన్నో బోట్లు తగలబడితే ....పోలీసులు ఎందుకు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించారు. కాకినాడలో బోట్లు తగలబడుతుంటే....పోలీసులు బోట్లు తిరగబడుతున్నాయని రాస్తున్నారన్నారు. తమ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే సీఎం ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశి ట్రేడింగ్ సుధాకర్ వెనుక ఉన్న వైసీపీ పెద్దలు ఎవరో తేలాలన్నారు. తాలిబన్ల నుండి తాడేపల్లి వరకు డ్రగ్స్ చేరాయని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.