విజయవాడ (ప్రజా అమరావతి);
*- "క్లాప్" పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం.. కేంద్రం నిధులు ఇందులో లేవుః మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ
*
*మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్ః*
*- రేపటి నుంచి "జగనన్న స్వచ్ఛ సంకల్పం-క్లీన్ ఆంధ్రప్రదేశ్"*
*- 100 రోజులపాటు "క్లాప్" కార్యక్రమం*
*- రేపు విజయవాడలో "క్లాప్" కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం శ్రీ జగన్*
*- దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా "క్లీన్ ఆంధ్రప్రదేశ్" కార్యక్రమంః మంత్రి బొత్స సత్యనారాయణ*
*బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏమన్నారంటే...*
1- దేశంలోని ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా ఏపీలో "క్లాప్" కార్యక్రమం నిర్వహిస్తున్నాం. "జగనన్న స్వచ్ఛ సంకల్పం-క్లీన్ ఆంధ్రప్రదేశ్" కార్యక్రమాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అమలు చేస్తున్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులు లేవు. నూటికి నూటి శాతం రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఒక యజ్ఞంలా ఆంధ్రప్రదేశ్ లో "జగనన్న స్వచ్ఛ సంకల్పం-క్లీన్ ఆంధ్రప్రదేశ్" కార్యక్రమం అమలు చేయబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా రేపు(అక్టోబరు 2న) విజయవాడలోని బెంజి సర్కిల్ లో ఉదయం 10. 30 గంటలకు చెత్త సేకరణ వాహనాలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రారంభిస్తారు.
2- ఇక పట్టణ ప్రాంతాలకు సంబంధించి కార్పొరేషన్లు, మున్సిపాల్టీలలోనూ 3097 హైడ్రాలిక్ గార్బేజ్ ఆటోలు, అలాగే వాటితో పాటు నగర పంచాయతీలు, థర్డ్‌గ్రేడ్ మున్సిపాల్టీల్లో ఇంకో 1771 ఈ-ఆటోలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో దాదాపు 38వేలమంది శానిటరీ వర్కర్లు.. ఇప్పుడు ఉన్నవారితో కలిపి నిరంతరం భాగస్వాములు కానున్నారు.
3- పట్టణ ప్రాంతాల్లో దాదాపు 40 లక్షల గృహాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా మూడు ప్లాస్టిక్ డస్ట్‌బిన్‌లను(రెడ్, బ్లూ, గ్రీన్ చెత్త బుట్టలు) ఇస్తున్నాం. అందులో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడానికి ఉదయం ఆరు గంటల నుంచే ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాపితంగా ప్రారంభం అవుతుంది. వీటన్నింటిని 231 గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ లు ఏర్పాటు చేసి, తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నాం.
4- క్లీన్ ఏపీలో భాగంగా రేపటి నుంచి పెద్ద ఎత్తున ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మీడియా కూడా సహకరించాలి. ప్రజలలో ఒక అవగాహన తీసుకు వచ్చి, ఒక సానుకూల దృక్పధంతో ముందుకు వెళుతున్నాం. రాష్ట్రం అంతా పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా పూర్తి భాగస్వామ్యులై విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రిగారు ఏ సంకల్పంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో అది నూటికి నూరుశాతం సక్సెస్ కావాలనుకుంటున్నాం.
5- వాటర్ ప్లస్ సిటీలుగా దేశంలో తొమ్మిది ఎంపికైతే....వాటిలో మూడు నగరాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. మురుగు నీటి శుద్ధి, పునర్వినియోగంలో తిరుపతి, విజయవాడ, విశాఖ నగరాలు ఎంపిక అయ్యాయని గర్వంగా చెబుతున్నాం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
6- మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ముఖ్యమంత్రిగారు ప్రజలకు సేవ చేయడమే కానీ, ఫోటోలకు, పబ్లిసిటీలకు ప్రాధాన్యత ఇవ్వరు. సోము వీర్రాజు గారు మాటలు నేను చూశాను. సోము వీర్రాజు గారు, ఆ పార్టీ ఎవరితోనైతే పొత్తులు పెట్టుకున్నారో, తన సహచరుల మాదిరిగానే ఆలోచన కంటే ఆవేశం ఎక్కు ఉన్నట్టే.. ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఇది కేంద్రం సాయంతో జరుగుతున్న కార్యక్రమం కాదు. నూటికి నూరు శాతం ప్రజల నుంచి వసూలు చేస్తున్న యూజర్ ఛార్జీల ద్వారా వచ్చిన డబ్బులతోనే వాహనాలు కొనుగోలు చేశాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం ఒక్క పైసా లేదు. రూరల్ ఏరియాల్లో ఇంకా యూజర్ ఛార్జీలను నిర్ణయించలేదు. ఇంకా సరిపోకపోతే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌గా విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెయ్యి కోట్ల వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కేంద్రం ఇస్తుంది, కానీ ఈ కార్యక్రమానికి కాదు.
----------
*పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాయింట్స్ః*
- ఒక పండగలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- మన ఇల్లే కాకుండా, వీధులు, గ్రామం శుభ్రంగా ఉండాలి
- వీటన్నింటి ద్వారా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పూర్తి పరిశుభ్రత
ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్పారంటే..:
జగనన్న స్వచ్ఛ సంకల్పం–క్లాప్:
గాంధీ జయంతి, లాల్ బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం. అర్బన్ ప్రాంతాల్లో క్లీన్ ఆంధ్రప్రదేశ్–క్లాప్ కార్యక్రమం. ఇందులో భాగంగా రేపు (శనివారం) చెత్త సేకరణ వాహనాలు ప్రవేశపెడుతున్నాం. సీఎం శ్రీ వైయస్ జగన్ ఆ వాహనాలను విజయవాడలో ప్రారంభిస్తారు.
ఆ వాహనాలు అన్ని జిల్లాలకు చేరిన తర్వాత మండల పరిషత్, జిల్లా ప్రజాపరిషత్‌ల ప్రతినిధులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ పక్షోత్సవాల స్ఫూర్తిగా:
గత ఏడాది కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఆగసు,్ట అక్టోబరులో పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహిస్తే, అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇంటికి రూ.2 చొప్పున ఇవ్వాలని కోరితే బాగా స్పందించారు. దాంతో ఆగస్టులో రూ.4 కోట్లు. అక్టోబరులో రూ.3 కోట్లు వచ్చాయి. ఆ కార్యక్రమం బాగా విజయవంతమైంది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని 100 రోజుల కార్యక్రమాన్ని రేపటి (శనివారం) నుంచి మొదలుపెడుతున్నాం.
గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, వారిని భాగస్వాములను చేసే కార్యక్రమాన్ని సీఎంగారు ప్రారంభిస్తారు. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను.
అవసరమైన వ్యవస్థ:
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి...
- ఇప్పటికే 10,645 సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్లు కట్టాం. వాటిలో కొన్నింటి పనులు మిగిలిపోగా, ఇప్పుడు వాటిని పూర్తి చేయడంతో పాటు, కావాల్సిన విధంగా మార్పులు చేస్తున్నాం. రాష్ట్రంలో 13,371 పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఇంకా 4,175 సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా నిర్మాణం చేస్తున్నాం.
రాష్ట్రంలో 27 వేల మంది గ్రీన్ అంబాసిడర్లు ఉన్నారు. వారి సేవలు కూడా వినియోగిస్తూ, వారికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తున్నాం. మరో 10 వేల మంది గ్రామ పంచాయతీ వర్కర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
14 వేల ట్రై సైకిళ్లు, 1000 ఆటోలు ఇస్తున్నాం. 10 వేల జనాభా ఉన్న గ్రామాలతో పాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పొరుగున ఉన్న గ్రామ పంచాయతీలకు ఆటోలు ఇస్తున్నాం.
ఇంకా 6,417 ఇన్సినరేటర్ పరికరాలు పంపిణీ చేయబోతున్నాం. వాటి ద్వారా శానిటరీ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రక్రియ. మొత్తం వీటన్నింటి ద్వారా కంపోస్ట్ ఎరువు తయారీ చేస్తూ, ఆ విధంగా పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. దీంతో పాటు, కమ్యూనిటీ టాయిలెట్ల పరిశుభ్రత కోసం 10,731 హైప్రెజర్ టాయిలెట్ క్లీనర్ల కేటాయింపుతో పాటు, దోమల నివారణకు 10,628 పోర్టబుల్ థర్మల్ ఫాగింగ్ యంత్రాలు పంపిణీ చేయబోతున్నాం
వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లకు ఈనెల 30 వరకు ఎస్‌ఐఆర్‌డి కింద శిక్షణ కార్యక్రమం నిర్వహించబోతున్నాం.
పచ్చదనం–పరిశుభ్రం:
తొలి విడతగా 5 వేలకు పైగా జనాభా ఉన్న ట్రైలర్‌తో కూడుకున్న ట్రాక్టర్లు. రెండో విడత కింద 2 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాలకు ట్రైలర్‌తో కూడిన ట్రాక్టర్లు ఇవ్వబోతున్నాం. జగనన్న పచ్చ తోరణం కింద మొక్కలు నాటడం. స్కూళ్లలో కూడా మొక్కలు నాటడానికి ఈ ట్రాక్టర్లు వినియోగం జరుగుతుంది. అంతే కాకుండా చెత్తను సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌కు తరలించడం కూడా సక్రమంగా జరుగుతుంది.
అందరి భాగస్వామ్యం:
గ్రామాల్లో సీసీ రోడ్లు. సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు జరిగాయి. అవన్నీ పరిశుభ్రంగా ఉండడంలో ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది కాబట్టి, ఈ 100 రోజుల కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి. అలాగే కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో పాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
addComments
Post a Comment