రుణాలు మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం



పెనుగొండ  (ప్రజా అమరావతి);


రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు  ఇచ్చిన హామీకి కట్టుబడి 4 విడతల్లో రూ.27 వేల కోట్ల డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలు మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం


మేరకు ఈ రోజు రెండో విడత ఆ మొత్తాలను వారి ఖాతాలోకి జమ చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ   మంత్రివర్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.


 సోమవారం వైఎస్సార్ ఆసరా ఫేజ్ -II  కింద ఆచంట నియోజకవర్గంలోని    డ్వాక్రా గ్రూపు అక్కచెల్లెమ్మలకు రూ. 49.19 కోట్ల రూపాయలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెనుగొండ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ, 2019 ఏప్రిల్ 11 న స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉన్న అప్పులను 4 దశల్లో తీర్చుతానని జగనన్న హామీ ఇచ్చారని మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు క్యాలెండర్ రూపొందించి వ్యక్తి దేశంలో నే కాదు, ప్రపంచంలో నే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్ధిక ఇబ్బందులకు వేరవక , వెనకడుగు వెయ్యకుండా వాటిని అమలు చేసిన విషయం తెలిసిందే అన్నారు. ఇప్పటికే ఒక విడత సొమ్ము మీ ఖాతాలోకి జమచేసి, నేడు రెండో విడతను ఇస్తున్నారన్నారు.  నవరత్నాలు లో అధిక సంఖ్యలో లబ్ది పొందిన వాళ్ళు మహిళలే అన్నారు.



మహిళలు పేరున పధకాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వానికి , మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, మీరందరూ జగనన్న వెనుక ఉండాలని కోరారు. 


  పెనుగొండ జనార్దన స్వామి కల్యాణ   మండపం వద్ద గ్రామసభ       పెనుగొండ గ్రామంకు చెందిన బ్ 332 గ్రూపులకు రూ.377.92  లక్షలు చెక్కు అందచేశారు. అనంతరం  


వడలి గ్రామంలోని  ఏర్పాటు చేసిన గ్రామ సభలో వడలికి చెందిన 119 గ్రూప్ లకీ  రూ.156.58 లక్షలు, , మునమర్రు కి చెందిన  20 గ్రూపు లకు  రూ.33.01 లక్షలు,  సోమరాజు చెరువుకి చెందిన  17 గ్రూపులకి రూ.13.64 లక్షలు, తామరాడ కి చెందిన 29 గ్రూపు లకి రూ.33 .95 లక్షలు,  కొఠాలపర్రు కి చెందిన 39 గ్రూపులకు రూ.. 34.76 లక్షలు,  రామన్నపాలెం కి చెందిన   72 గ్రూపులకు రూ.84.05 లక్షల కు సంబంధించి    లబ్ధిదారులకు మంత్రివర్యులు చెక్కును అందజేశారు.


ఈ పర్యటన లో మంత్రి వెంట  సర్పంచ్ లు కె. విజయలక్ష్మి,ఎమ్ కె సత్యనారాయణ, వై ఎస్ వరప్రసాద్, డి.రూపవతి, టివిఎస్ నాగరత్నం, ఎంపిపి పి. వెంకటేశ్వరరావు, వైస్ ఎంపిపి పి. సుబ్రహ్మణ్యం, ఎంపిటిసి లు, జెడ్పిటిసి సభ్యులు, స్థానిక నాయకులు మురళి , పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments