నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనము, వాటర్ ట్యాంక్


నెల్లూరు, అక్టోబర్ 12 (ప్రజా అమరావతి): రాపూరు నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పాల్గొన్నారు. 

  ముందుగా రాపూరు మండల పరిధిలోని సైదాదుపల్లిలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనము, వాటర్ ట్యాంక్


, సచివాలయ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గ్రామ కొలనుల అభివృద్ధి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన రాపూరు సమీపంలోని ఎర్ర చెరువును పరిశీలించారు. చెరువు అభివృద్ధికి చేపడుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

 ఈ కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీ సుబ్రహ్మణ్యం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ శ్రీ మేడా శ్రీనివాస్ కుమార్, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, ఎంపీడీవో శ్రీ ఆమోష్ బాబు, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీ శివారెడ్డి, డి ఈ శ్రీ ఏడుకొండలు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీమతి నాగజ్యోతి, రాపూరు ఎంపీపీ శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి, రాపూరు సర్పంచ్ శ్రీమతి జయమ్మ తదితరులు పాల్గొన్నారు. 


Comments