అమరావతి (ప్రజా అమరావతి);
*ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిసిన కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఈవో సులజ్జ ఫిరోదియా మొత్వాని, కో–ఫౌండర్ రితేష్ మంత్రి*
*ఏపీలో రూ. 1,750 కోట్లతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చిన కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ*
*విశాఖలో బ్రాండెడ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ఆసక్తి కనపరిచిన కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ
*
*స్కిల్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్న కైనెటిక్*
*ఇప్పటికే పూణే సమీపంలోని అహ్మద్‌నగర్‌లో నెలకు 6,000 ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్ధ్యంతో కల ప్లాంట్‌ని ఏర్పాటుచేసిన కైనెటిక్*
*కంపెనీ ప్రణాళికలను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌కు వివరించి చర్చించిన ప్రతినిధులు*
*ఈ సమావేశంలో పాల్గొన్న పురపాలక, పట్టణాభివృద్దిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు.*
addComments
Post a Comment