పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని



కె.ఆర్.పురం (ఐటిడిఎ)  (ప్రజా అమరావతి);



పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని


కాలనీవాసుల సమస్యలను పరిష్కారం చూపుతామని జాయింట్ కలెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. 


బుధవారం స్థానిక  కన్నాపురం ఐటీడీఏలో అధికారులు, సర్పంచ్‌లతో నిర్వహించిన పి.ఎల్. ఎమ్.సి., సమావేశానికి జేసి హాజరయ్యారు. ఈ సందర్భంగా  జాయింట్ కలెక్టర్‌ డా. బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ,  పోలవరం నిర్వాసితుల సమస్యలను క్షేత్ర  స్థాయిలో పరిష్కరించేందుకు సర్పంచ్‌లు, అధికారులతో ప్రాజెక్టు లెవెల్‌ మోనిటరింగ్‌ కమిటీ (పి.ఎల్. ఎమ్.సి.) సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  45 రోజుల / రెండు నెలల వ్యవధిలో పి ఎల్ ఎమ్ సి సమావేశాలను నిర్వహించి వారి సమస్యలకు సానుకూల పరిష్కారం చూపుతామన్నారు. ప్రతి సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం చూపేందుకు కృషి చేయాలనే ఈ సమావేశం నిర్వహించా మన్నారు. నిర్వాసితులకు  ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుకు పీఎల్‌ఎంసీ కమిటీలు ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం అన్నారు..

కమిటీ సభ్యుల సమావేశంలో లిఖిత పూర్వకంగా సమస్యలు  తెలియజేస్తే పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోగలమన్నారు.  ప్రభుత్వం దృష్టికి మీమీ సమస్యలు తీసుకుని వెళ్లి పరిష్కారం కి కృషి చేస్తామన్నారు. భూమికి భూమి ఇచ్చిన వారి విషయంలో భూముల భద్రత విషయంలో సహకారం ఇస్తామని, మీరందరూ సమిష్టిగా ఉండాలని ఆయన కోరారు. 


జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్లలో   పునరావాస ప్యాకేజీ అం దించాలని , గతంలో కేటాయించిన భూముల ను స్వాధీన పరచాలని, ఇంటి నిర్మాణం కోసం లేఔట్ లలో స్థలాలు, పట్టాదారు పాసుపుస్తకాలు , తమకు కేటాయించిన భూమిలో  వేరే వారు సాగు చెయ్యడం , ఇంటి నిర్మాణం చేస్తున్నారు వంటి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు రావడం జరిగింది.  దరఖాస్తులను పరిశీ లించి గ్రామసభలు నిర్వహించి అర్హులందరికీ ప్యాకేజీ అందజేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో చర్చకు వొచ్చిన అంశాలపై ప్రభుత్వానికి మినిట్స్ ద్వారా నివేదిక పంపుతామని పిఓ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. బరియల్ గ్రౌండ్ కు సంబంధించిన స్థలాలు సమస్యకు పరిష్కారం చూపి స్థల కేటాయింపు పూర్తి చేయాలని జేసి ఆదేశించారు. 


ఈ సమావేశం  పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి /ఎక్స్ ఆఫీషియో జేసి ఓ ఆనంద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.  జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వై.వి.ప్రసన్న లక్ష్మీ, ఎస్డీసి లు గీతాంజలి, సూర్యనారాయణ రెడ్డి, ఎస్సి కె. నరసింహమూర్తి, షెడ్యూల్ తెగల నిర్వాసితుల ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, తహసీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.



Comments