18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోండి*18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోండి


:-*


*శని, ఆదివారాల్లో ఓటర్ నమోదు ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ*


*బీఎల్‌ఓలు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించాలి :-*


*ఓటరు నమోదు  ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-*

 

కర్నూలు, నవంబర్ 20 (ప్రజా అమరావతి):-


వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అన్నారు.


శనివారం కర్నూలు నగరంలోని ఎస్టీబీసి డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన 35, 36, 37, 38, 39, 40 పోలింగ్ స్టేషన్ లో ఓటరు నమోదు చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు పరిశీలించారు..  ఎంతమంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు అన్న వివరాలను బి ఎల్ ఓ లను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. శని ఆదివారాల్లో నిర్వహిస్తున్న  స్పెషల్ డ్రైవ్ లో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.. ఓటరు నమోదు చేయడం లో బీఎల్‌ఓలు  కీలకపాత్ర పోషించాలన్నారు. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ - 2022లో భాగంగా నూతనంగా ఓటరుగా నమోదు చేసుకొనుటకు, ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారు మార్పులు, చేర్పులు చేసుకొనుటకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. నవంబరు 30వ తేదీ వరకు నమోదు చేసుకొనుటకు గడువు ఉందని సూచించారు. ఓటరుగా ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్ లైన్ విధానంలోనూ నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్  www.ceoandhra.nic.in మరియు www.nvsp.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు.  ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ముఖ్యంగా విద్యార్థులు, యువత ఉపయోగించుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఓటరుగా నమోదు కావడం వల్ల ఒక పౌరుడిగా ఒక రాజ్యాంగబద్ధమైన విధానంలో సభ్యునిగా చేరిన సంతృప్తి ఉంటుందన్నారు. ఈ అవ‌కాశాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ వినియోగించుకోవాల‌ని, అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌తో పోలింగ్ స్టేష‌న్ల‌కు వెళ్లి, త‌ప్ప‌నిస‌రిగా త‌మ పేరును ఓట‌ర్ల జాబితాలో చేర్చుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కోరారు.


జిల్లా కలెక్టర్ గారి వెంట కర్నూలు అర్బన్ మరియు రూరల్ తహసీల్దార్ లు, బిఎల్ ఓలు, తదితరులు పాల్గొన్నారు.