*ప్రశాంతంగా ముగిసిన బేతంచర్ల నగర పంచాయతీ 20 వార్డులు మరియు నందికొట్కూరు మునిసిపాలిటీ పదో వార్డు స్థానాల ఎన్నికల పోలింగ్ :-*
*ఓటు హక్కు వినియోగించుకున్న 22,615 మంది ఓటర్లు....72.95 శాతం పోలింగ్ :-*
*జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వర రావు :-*
కర్నూలు, నవంబర్ 15 (ప్రజా అమరావతి):-
*కర్నూలు జిల్లాలో బేతంచర్ల నగర పంచాయతీ 20 వార్డులు మరియు నందికొట్కూరు మునిసిపాలిటీ 10 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అందుకు సహకరించిన ఓటర్ లతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులందరికీ జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వర రావు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.*
*జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... బేతంచర్ల నగర పంచాయతీ 20 వార్డులు మరియు నందికొట్కూరు మునిసిపాలిటీ పదో వార్డుకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా విజయవంతంగా ముగిసిందన్నారు . ఇందుకు సంబంధించి 21 వార్డుల్లోని 41 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 30,999 ఓటర్లు ఉండగా, ఇందులో 22,615 మంది ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు వినియోగించుకోగా....72.95% పోలింగ్ నమోదయ్యాయన్నారు.*
*బేతంచెర్ల నగరపంచాయతీ 20 వార్డుల్లో సంబంధించి మొత్తం ఓటర్లు 30,012 ఉండగా అందులో 21,835 మంది ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు వినియోగించుకోగా... 72.75% నమోదైంది. నందికొట్కూరు పదో వార్డుకు సంబంధించి మొత్తం ఓటర్లు 987 ఉండగా అందులో 780 మంది ఎన్నికల పోలింగ్ లో పాల్గొని ఓటు వినియోగించుకోగా...79.03 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ వివరించారు*
*పకడ్బందీగా కౌంటింగ్ ఏర్పాట్లు :-*
*బేతంచెర్ల నగర పంచాయతీ మరియు నందికొట్కూరు పదో వార్డుకు సంబంధించి ఈ నెల 17 తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుందని, కౌంటింగ్ సజావుగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.*
*కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ :-*
*కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఉదయం 7 గంటల నుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వరరావు బేతంచెర్ల నగర పంచాయతీ మరియు నందికొట్కూరు పదో వార్డు పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు చేపట్టారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, డి ఆర్ ఓ పుల్లయ్య, ఎన్నికల నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.*
addComments
Post a Comment