23వ వార్డుకి పోటీలో నలుగురు అభ్యర్థులు

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);


23వ వార్డుకి పోటీలో నలుగురు అభ్యర్థులు కొవ్వూరు పట్టణం.. 23 వ వార్డుకు దాఖలైన తొమ్మిది  నామినేషన్ల లో ఉపసంహరణ అనంతరం  నలుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారని కొవ్వూరు మునిసిపల్ కమీషనర్ టి. రవి కుమార్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు..


పోటీలో ఉన్న నలుగురు అభ్యర్థుల వివరాలు : అద్దురి సత్యనారాయణ , బీజేపీ . (కమలం గుర్తు) ;   అశోక్ కుమార్ దగ్గు, సీపీఐ(ఎమ్) ..(సుత్తి కొడవలి  గుర్తు) ;  మురుగొండ రమాదేవి, టిడిపి ..(సైకిల్ గుర్తు) ;  రుద్రం వీరబాబు, స్వతంత్ర అభ్యర్థి .. (బీరువా గుర్తు) లు ఉన్నారని తెలిపారు. వైఎస్సార్ పార్టీ, జనసేన, ఇతర అభ్యర్థులు వారి నామినేషన్లు ఈ రోజు ఉపసంహరించుకున్నట్లు మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్  తెలిపారు.
 స్థానిక ముస్లిం 15వ తేదీ (సోమవారం) ఉదయం 7 నుండి సా.5 వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.  ఇందు కోసం మండల పరిషత్తు ఎలిమెంటరీ స్కూల్ (ముస్లిం స్కూల్) మెరకవీధి, కొవ్వూరు ప్రాంగణంలో రెండు తరగతి గదులను గుర్తించి తుది నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.  ఓటర్ల జాబితాను  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో  21.8.2021 న ఓటర్ల తుది జాబితాను ప్రచురించామన్నారు.   23వ వార్డు పరిధిలో మొత్తం 1412 మంది ఓటర్లు ఉన్నారని వీరిలో పురుషులు  672 మంది,  స్త్రీ లు 740 మంది ఉన్నారని తెలిపారు.  పోలింగ్ కేంద్రం 23/1 లో మొత్తం 706    మంది   ఓటర్లు లో 345   పురుషులు  , 361 స్త్రీ ఓటర్లు , 23/2 పీఎస్ పరిధిలో మొత్తం 706 మంది  ఓటర్లు లో 327  పురుషులు, 379 స్త్రీలు ఉన్నారని రవికుమార్ తెలిపారు.   ఒకవేళ రిపోలింగ్ నిర్వహించాల్సి వొస్తే 16 వతేది రిపోలింగ్ చేపడతామని,  నవంబర్ 17 వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు.