ఏలూరు 45 వ డివిజన్ ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తి అయినది.ఏలూరు 45 వ  డివిజన్  ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తి అయినది


 పోలైన ఓట్లు 2157.. వైఎస్సార్ సిపి అభ్యర్థి కి 1117 ఓట్లు పోలైయ్యాయిఏలూరు (ప్రజా అమరావతి);


ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ 45 వ వార్డ్ ఓట్స్  లెక్కింపు పూర్తి అయిన తర్వాత వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మహమ్మద్ ఇలియాస్ పాషా   సమీప టిడిపి అభ్యర్థి పై 424 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని ఏలూరు కార్పొరేషన్ మునిసిపల్ కమిషనర్ డి. చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు..45  వ  వార్డు  కి జరిగిన ఉప ఎన్నికలు ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని మునిసిపల్ కమిషనర్  పేర్కొన్నారు.

45వ వార్డు ఎన్నికల ఆర్వో గాఎమ్. సత్యము వ్యవహరించారని తెలిపారు.వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మహమ్మద్ ఇలియాస్ పాషా కి 1117 ఓట్లు, టిడిపి కి 693, జనసేన 267, బిజిపి కి 10, స్వతంత్ర అభ్యర్థి కి 5, నోటా ఓట్లు 42, పనికి రాని ఓట్లు 23 పోలైయ్యాయని పేర్కొన్నారు.


కౌంటింగ్  కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు.  తెలిపారు.