దళితుల స్థితిగతులు, దళితుల అభిరుద్ది

 న్యూ ఢిల్లీ (ప్రజా అమరావతి); జాతీయ ఎస్సి కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హాల్డేర్ గారిని ఆయన కార్యాలయములో కలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు శ్రీ జూపూడి ప్రభాకర రావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించి అట్రాసిటీ ఆక్ట్ ఇంప్లిమెంటేషన్, దళితుల స్థితిగతులు, దళితుల అభిరుద్ది


పట్ల ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి అంకిత భావం మొదలైన అంశాల మీద జాతీయ ఎస్సి కమిషన్ వైస్ చైర్మన్ గారితో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు శ్రీ జూపూడి ప్రభాకర రావు గారు చర్చించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, దళితుల అభిరుద్ది, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వైస్ చైర్మన్ గారు అభినందించి, గతంలో రమ్యశ్రీ కేసు గురించి గుంటూరు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని ముఖ్యమంత్రి గారు  డైనమిక్ పర్సన్ అని అన్నారని ఓ ప్రకటనలో తెలిపారు.

Comments