దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం


తిరుపతి, నవంబర్ 13 (ప్రజా అమరావతి):-

ఈనెల 14వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.  ఇందులో భాగంగా ఈనెల 13వ తేదీ శనివారం సాయంత్రం 5.45 గంటలకు  గన్నవరం నుండి బయలుదేరి రాత్రి 7.05 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం  చేరుకుని, అనంతరం 

7.45 నిమిషాలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి  స్వాగతం  పలుకనున్నారు. అనంతరం రాత్రి 

8.55 నిమిషాలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్  చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకొని రాత్రి 9:40 నుండి 10:15 నిమిషాలకు వరకు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం 10.35 గం తిరుమల నుండి  బయలుదేరి 11.05 గం కు తిరుపతి తాజ్ హోటల్  చేరుకుంటారు. అనంతరం  రాత్రి 11.30 గం రేణిగుంట ఎయిర్ పోర్ట్ చేరుకొని అక్కడినుండి బయలుదేరి 12.30 గం గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అలాగే

ఈనెల 14వ తేదీన మధ్యాహ్నం 1.05 గం గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి 2.0 5 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుండి  02:15 గం బయలుదేరి 2.45 గం తిరుపతి తాజ్ హోటల్ కి చేరుకొని సాయంత్రం 7.00 గం వరకు దక్షిణ రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.