ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఫోన్‌

 19.11.2021.

అమరావతి. (ప్రజా అమరావతి);


ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఫోన్‌:



ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆయన ఆరా తీశారు. రాష్ట్రంలో పరిస్థితులను, వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రధానికి నివేదించారు. వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. సహాయ కార్యక్రమాల కోసం నేవీ హెలికాప్టర్లు వినియోగించుకుంటున్నామని ఆయన ప్రధానికి తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో కేంద్రం పూర్తి అండగా ఉంటుందని, ఏ సహాయం కావాలన్నా కోరాలని ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ సీఎంకు చెప్పారు.