కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఆరు ఎంపిటిసి, పెనుగొండ జెడ్పిటిసి స్థానాలకు ఎన్నికల కు సర్వం సిద్ధం..

 


కొవ్వూరు (ప్రజా అమరావతి);  



కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఆరు ఎంపిటిసి, పెనుగొండ జెడ్పిటిసి స్థానాలకు ఎన్నికల కు సర్వం సిద్ధం..


ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది , సామగ్రి


మంగళవారం  ఉదయం 7 నుండి సా.5 వరకు పోలింగ్, నిర్వహిస్తున్నట్లు కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. అవసరమైన పక్షంలో ఎన్నికల్ని నిర్వహించేందుకు రిపోలింగ్ కి  17 వతేది ను రిజర్వుడ్ డే గా ఉంచామన్నారు. నవంబర్ 18వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు.


ఏడు ఎంపిటిసి స్థానాలకు దాఖలైన  నామినేషన్లు లో ఉపసంహరణ అనంతరం  తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ఎంపీటీసీ అభ్యర్థి ఏకగ్రీవం కాగా మిగిలిన 6 స్థానాలకు 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. 




పోటీలో ఉన్న ఎంపీటీసీ అభ్యర్థులు : 


 అత్తిలి మండలంలో ఈడూరు  నుంచి బి.పెద్దిరాజు (టీడీపీ)  , ఎస్. నాగేశ్వరరావు (వైఎస్సార్ సిపి) , పి. వెంకట సుబ్బారావు (జనసేన), పాలూరు నుంచి వి.గోవింద రావు (టిడిపి), ఎస్ ఆర్ విష్ణుమూర్తి (వైఎస్సార్ సిపి) , కె. శ్రీనివాసరావు (జనసేన) అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈడురు లో 3 పోలింగ్ కేంద్రాల లో 2409 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1210, స్త్రీలు 1199 మంది ఉన్నారు. పాలూరు  లో రెండు పోలింగ్ కేంద్రాల లో 1947 మంది ఓటర్లు ఉండగా పురుషులు 985,  స్త్రీలు 962 మంది ఉన్నారు. 


చాగల్లు మండలంలో చాగల్లు-5 కి వి.విజయకుమారి (వైఎస్సార్ సిపి), కె.ధనలక్ష్మి (బీజేపీ), పి. రజని (టీడీపీ) పోటీలో ఉన్నారు. జడ్పీ హెచ్ స్కూల్ కేంద్రం లో  నాలుగు పోలింగ్ కేంద్రాల లో 3428 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 1651, స్త్రీలు 1777 మంది ఉన్నారు. 


 ఇరగవరం మండలంలో కె. కుముదవల్లి లో రాచకొండ వెంకటరావు, (టీడీపీ), రాయి రామచంద్ర (వైఎస్సార్ సిపి) , పిండి గోవింద రావు(జనసేన) అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో 1711 మంది ఓటర్లు లో 841 మంది పురుష, స్త్రీలు 870 మంది ఉన్నారు. 


 నిడదవోలు మండలంలో తాళ్లపాలెం లో ముగ్గురు అభ్యర్థులు బి.కృష్ణ బాబు (వైఎస్సార్ సిపి) , బి.రమేష్ బాబు (ఐ.ఎన్.సి), పి. రాజేష్ (జనసేన) లు పోటీలో ఉన్నారు. ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో 1751 పురుష, 1842 మహిళా ఓటర్లు ఉన్నారు. 


పెరవలి మండలం కానూరు-2 కి ఇద్దరు అభ్యర్థులు  వి.సుభద్రమ్మ (బీఎస్పి),  ఎమ్. ఉషారాణి (వైఎస్సార్ సిపి) లు పోటీలో ఉన్నారు. ఇక్కడ మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో 2783 మంది ఓటర్లు ఉండగా 1399 పురుష, 1384 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.


కొవ్వూరు డివిజన్ పరిధిలోని  తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ఎంపీటీసీ స్థానానికి కొమ్మిరెడ్డి వీరరాఘవమ్మ (వైఎస్సార్ పార్టీ) ఏకగ్రీవం అయ్యారు.



Comments