నూతనంగా ఎన్నికైన సభ్యులతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పాలకమండలి


నెల్లూరు నవంబర్ 22 (ప్రజా అమరావతి); 

ఇటీవల నూతనంగా ఎన్నికైన సభ్యులతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పాలకమండలి
సోమవారం కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో కమిషనర్ శ్రీ వి. శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నాలుగో వార్డు సభ్యురాలు శ్రీమతి మోర్ల సుప్రజ ను  ఏకగ్రీవంగా నగర పంచాయతీ చైర్ పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది. అలానే డిప్యూటీ ఛైర్ పర్సన్స్ గా 19 వ వార్డు నుండి ఎన్నికైన శ్రీమతి కోటంరెడ్డి లలిత, 5 వ వార్డు నుండి ఎన్నికైన శ్రీ షేక్ షాహుల్ ఎన్నికైనారు. ఈ సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యుని హోదా లో  కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరై నూతన సభ్యులను అభినందించారు.