రాష్ట్రంలో రహదారులపై ఉన్న గుంతలు తక్షణమే పూడ్చాలి.


అమరావతి (ప్రజా అమరావతి);


*రహదారుల మరమ్మత్తులు, పునరుద్దరణపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష*


*రాష్ట్రంలో రహదారులపై ఉన్న గుంతలు తక్షణమే పూడ్చాలి*


*వెంటనే పనులు ప్రారంభించండి – అధికారులకు సీఎం ఆదేశాలు*

*46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై అధికారులు దృష్టి పెట్టండి*

*ముందు పాట్‌ హోల్‌ ఫ్రీ స్టేట్‌గా రహదారులు ఉండాలి, తర్వాత కార్పెటింగ్‌ పనులు పూర్తిచేయాలి*

*విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులు వాహనదారులకు అందుబాటులోకి రావాలి*

*ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌లలో టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి*

*2022 జూన్‌ కల్లా రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తులు, పునరుద్దరణ పూర్తికావాలి – సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*

*రాష్ట్రం మొత్తం రహదారుల మరమ్మత్తులు ఒక డ్రైవ్‌లా చేయాలి*


రాష్ట్రంలో ఏ రోడ్లు కూడా గుంతలు లేకుండా ఉండేలా ముందు చేయాలి, తర్వాత కార్పెటింగ్‌ చేస్తే బావుంటుంది – సీఎం

ఎక్కడా పాట్‌ హోల్స్‌ మిగిలిపోకుండా అన్ని రోడ్ల మీద అన్ని చోట్లా గుంతలు పూడ్చాలి, పాట్‌ హోల్‌ ఫ్రీ చేయడానికి వెంటనే పనులు ప్రారంభించండి – సీఎం

స్పెసిఫిక్‌ రోడ్లు కాకుండా రాష్ట్రం మొత్తం చేయండి, ఎక్కడా ప్యాచ్‌ కనిపించకూడదు, మేం అన్ని చేశామనే మెసేజ్‌ వెళ్ళాలి – సీఎం

మేజర్‌ రోడ్లకు ట్రాఫిక్‌ను బట్టి ఏ మేరకు మరమ్మత్తులు చేయాలనేదానిపై సమావేశంలో వివరించిన అధికారులు

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల వివరాలు, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగిన సీఎం

అర్జెంట్‌ రిపేర్లు చేయాల్సిన పనుల స్టేటస్‌ వివరించిన అధికారులు

వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందన్న అధికారులు

రాష్ట్రంలో రహదారులన్నీ కూడా తక్షణమే మరమ్మత్తులు చేయాలి, అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఏ కేటగిరి అయినా సరే 46 వేల కిలోమీటర్లు వెంటనే రిపేర్‌ చేయాలి, ఎక్కడా గుంతలు ఉండటానికి వీల్లేదు

మాగ్జిమం డ్యామేజ్‌ అయిన రోడ్లపై వెంటనే దృష్టిపెట్టండి

రోడ్లు మరమ్మత్తులు చేసిన తర్వాత తేడా కనిపించాలి, ఇంత చేసిన తర్వాత మరొకరు విమర్శించే అవకాశం ఉండకూడదు

ఈ నెలాఖరికల్లా టెండర్లు పూర్తి చేసి 8268 కిలోమీటర్లు రోడ్ల మరమ్మత్తులు వెంటనే మొదలుపెడుతున్నట్లు అధికారుల వెల్లడి 

46 వేల కిలోమీటర్లు మొత్తం ఒక యూనిట్‌గా తీసుకోండి, ఎక్కడ అవసరమైతే అక్కడ వెంటనే మరమ్మత్తులు చేయాలి

వర్షాలు తగ్గగానే డిసెంబర్‌ నుంచి జూన్‌ వరకు అన్ని రోడ్ల మరమ్మత్తులు పూర్తిచేస్తామన్న అధికారులు

అన్ని బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్‌లు కూడా కవర్‌ చేయాలి – సీఎం

ఆర్‌వోబీలు, బ్రిడ్జిలు కూడా ఫేజ్‌ 1 పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించండి – సీఎం


ఎన్‌డీబీ (న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌) సహకారంతో ప్రారంభించిన ప్రాజెక్ట్‌ల టెండర్లలో పాల్గొని కాంట్రాక్ట్‌లు పొందిన కాంట్రాక్టర్‌లు పనులు ప్రారంభించకపోతే వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టండి, దీనిపై అధికారులు సీరియస్‌గా స్పందించాలి, వారంలోపు పనులు ప్రారంభించకపోతే బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామంటూ నోటీసులు ఇవ్వండి – సీఎం ఆదేశాలు


ఏ రోడ్డు అయినా సరే మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ అయినా సరే ఎవరి పరిధిలో ఉన్నా వెంటనే మరమ్మత్తులు చేయాలి – సీఎం

మున్సిపాలిటీలలో, కార్పొరేషన్‌లలో కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలి

నాడు నేడు తరహాలో ప్రతీ రోడ్డు కూడా ఫోటోలు ఉండాలి, రోడ్లు రిపేర్‌ చేసేముందు ఫోటోలు తీయండి, తర్వాత రిపేర్‌ చేసిన తర్వాత కూడా ఫోటోలు తీయాలి


కొత్త రోడ్ల నిర్మాణం కన్నా ముందు రిపేర్లు, మెయింటెనెన్స్‌ మీద ముందు దృష్టి పెట్టండి, నిధులకు సంబంధించి అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయండి – సీఎం

2022 జూన్‌కల్లా రాష్ట్రంలో రహదారులన్నీ కూడా మరమ్మత్తులు పూర్తికావాలి

పంచాయతీల పరిధిలోని రోడ్ల మరమ్మత్తులు కూడా పూర్తవ్వాలి– సీఎం


వచ్చే నెలలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్న క్రమంలో ఈ లోపు ఏపీకి సంబంధించి పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన సీఎం


పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పురపాలక పట్టణాభివృద్ది శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.టీ.కృష్ణబాబు, పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ.సత్యనారాయణ, పురపాలక శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఎం ఎం.నాయక్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరు.