*గణపవరం విద్యార్థులకు ఎమ్మెల్యే గారి అభినందనలు*
*చెకుముకి టెస్టులో జిల్లా స్థాయిలో మొదటిస్థానం సాధించడం గర్వకారణం*
*ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుకు ఇది అద్దం పడుతోంది*
*విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులతో విద్యార్థులకు ఎంతో మేలు*
*చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు*
*ఎమ్మెల్యే గారిని కలిసిన గణపవరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు*
చిలకలూరిపేట (ప్రజా అమరావతి);
చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ జిల్లాస్థాయి పోటీల్లో గణపవరం గ్రామానికి చెందిన విద్యార్థులు మొదటి స్థానం సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే విడదల రజిని గారు సంతోషం వ్యక్తంచేశారు. గణపవరం గ్రామంలోని కెల్లంపల్లి భద్రాచలం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామ, మండల, జిల్లా స్థాయిలు దాటుకుని చెకుముకి పోటీల్లో మొదటి స్థానం సాధించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 93 టీమ్‌లు ఈ పోటీల్లో పాల్గొనగా గణపవరం కేపీజెడ్‌పీహెచ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి తొలిస్థానం దక్కించుకున్నారు. సత్తా చాటిన విద్యార్థులతోపాటు పాఠశాల ఉపాధ్యాయులు, గణపవరం గ్రామ నాయకులు సోమవారం ఎమ్మెల్యే గారిని కలిశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు సాధించిన విజయం గురించి వివరించారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎంత మెరుగ్గా పనిచేస్తున్నారో చెప్పడానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యారంగంలో పెనుమార్పులు తీసుకొచ్చామని తెలిపారు. అమ్మఒడి, నాడునేడు, ఆంగ్ల మాధ్యమం, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకాలన్నీ పేద విద్యార్థుల చదువుకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి సాధించిన విద్యార్థులు చంద్రకాంత్ గుప్త, నాగయశ్వంత్, నిహారికారెడ్డిలకు ఎమ్మెల్యే విద్యార్థులకు అభినందనలు తెలిపారు. చదువుల్లో ప్రతిభ చూపే విద్యార్థులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో గణపవరం గ్రామ మాజీ సర్పంచ్ కెల్లంపల్లి సుందరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, గణపవరం సొసైటీ అధ్యక్షుడు కాట్రు రమేష్, కౌన్సిలర్లు తులం సుధాకర్, పిల్లి సాగర్‌బాబు, షేక్ ఆదం వలి, విద్యాకమిటీ చైర్మన్ సూరా శంకరరెడ్డి, విద్యాకమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి.సత్యనారాయణ, సైన్స్ మాస్టర్ వై.శ్రీనివాసరావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
addComments
Post a Comment