ఎమ్మెల్సీగా వై.శివ రామి రెడ్డి నామినేషన్ దాఖలు

 ఎమ్మెల్సీగా  వై.శివ  రామి రెడ్డి నామినేషన్  దాఖలు


అనంతపురం, నవంబర్20 (ప్రజా అమరావతి)


:  అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  స్థానానికి వైయస్సార్ సిపి పార్టీ తరఫున  వై శివరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శనివారం కలెక్టరేట్లోని అనంతపురం లోకల్ అథారిటీస్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి( జాయింట్ కలెక్టర్ రెవెన్యూ)  నిశాంత్ కుమార్ కు 2 సెట్లు నామినేషన్లు అందజేశారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి,  శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, తదితరులు  పాల్గొన్నారు.