మంత్రి మేకపాటిని లక్షద్వీప్ కి రమ్మంటూ ఆహ్వానం

 *


*లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్  ప్రఫుల్ పటేల్ తో మంత్రి మేకపాటి మర్యాదపూర్వక భేటీ*


*ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంబంధించిన అంశాలపై చర్చ*


*మంత్రి మేకపాటిని లక్షద్వీప్ కి రమ్మంటూ ఆహ్వానం


*


అమరావతి, నవంబర్,13 (ప్రజా అమరావతి);  ఆదివారం జరగబోయే 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ కి హాజరయ్యేందుకు విచ్చేసిన కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తిరుపతిలోని గ్రాండ్ రిట్జ్ హోటల్లో సమావేశమై...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పర్యాటకాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలపై మంత్రి మేకపాటి చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యాటించాలని మంత్రి మేకపాటి ప్రఫుల్ పటేల్ ని కోరారు. అనంతరం లక్షదీప్ కు రావాలని అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ కూడా మంత్రి మేకపాటిని ఆహ్వానించారు.


--------