బాధ్యులు పై చర్యలు తీసుకుంటాం ఐటిడిఎ పి.ఓ. రోణంకి గోపాల క్రిష్ణబాధ్యులు పై చర్యలు తీసుకుంటాం


ఐటిడిఎ పి.ఓ. రోణంకి గోపాల క్రిష్ణ 


పాడేరు నవంబర్ 23 (ప్రజా అమరావతి): కేజిబివి  విద్యార్థులు అస్వస్థకు గురవ్వడంపై  సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల క్రిష్ణ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా ఆసుపత్రిని సందర్శించి కెజిబివి విద్యార్ధులను పేరు పేరున పరామర్శించారు. విద్యార్థులు సోమవారం సాయంత్రం తీసుకున్న ఆహారం పై ఆరాతీశారు. వేడి ఆహారమా ,చల్లనిది పెట్టారని ప్రశ్నించారు. వేడి భోజనం పెట్టారని విద్యార్థులు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. కొంత మంది కడుపు నొప్పి, తలనొప్పిగా ఉందన్నారని వారిని ఆసుపత్రిలో ఉంచి మిగిలిన వారిని డిచార్జీ చేయాలని  వైద్యాధికారులను ఆదేశించారు. విద్యార్థుల కు నాణ్యమైన పోషకాహారం అందించాలని కెజిబివి అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పట్ల తగిన శ్రద్ద తీసుకోవాలని సూచించారు. అనంతరం కెజిబివి పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను ఆడిగితెలుసుకున్నారు. నీటి సమస్య ఉందని విద్యార్థులు పి.ఓ దృష్టి కి తీసుకుని వచ్చారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.  అనంతరం 10 తరగతి విద్యార్థులకు సాంఘీక శాస్రం పాఠాలను బోధించారు. ఏజెన్సీలోని ప్రతి కెజిబివి ని తనిఖీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.చంద్రకళ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్  డా.కృష్ణరావు,  గిరిజన సంక్షేమశాఖ డిడి జి.విజయకుమార్, ఏజెన్సీ డి ఈఓ డా.పి.రమేష్, atwo ఎల్.రజని తదితరులు పాల్గొన్నారు.