రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం.

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం.రేణిగుంట విమానాశ్రయం, నవంబర్,13 (ప్రజా అమరావతి):


రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రులు, ఎం పీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. శనివారం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి,మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి,జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ,తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి,టి టి డి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, టిటీడీ ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్,తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి, సత్యవేడు, పూతలపట్టు  నగరి ఎమ్మెల్యేలు ఆదిమూలం,ఎం ఎస్ బాబు ,రోజా,డీజీపీ గౌతమ్ సవాంగ్,డీఐజీ కాంతిరాణా టాటా, తిరుపతి అర్బన్ ఎస్ పి వెంకట అప్పల నాయుడు,తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష  ఆర్డీఓ కనక నరసారెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి సాదర స్వాగతం పలికారు .


ఈ కార్యక్రమంలో  రేణిగుంట తహసిల్దార్ శివ ప్రసాద్,విమానాశ్రయ డైరెక్టర్ సురేష్,ఇతర అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.