బాలకార్మిక,బాల్యవివాహ వ్యవస్థ నుండి బాల్యాన్ని రక్షిద్దాం

  గాంధీనగర్ విజయవాడ (ప్రజా అమరావతి);


 *బాలకార్మిక,బాల్యవివాహ వ్యవస్థ నుండి బాల్యాన్ని రక్షిద్దాం*


 ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ ,CHILDLINE-1098అధినేత బి ఎస్ కోటేశ్వరరావు.


  బాలలందరికి బాల్యం ఒక వరం లాంటిదని అలాంటి బాలలు సమాజంలో నేడు పేదరికంలో సమాజంలో నిరాదరణకు గురై తల్లిదండ్రులకు,చదువుకు దూరమై వీధుల్లో అనాధలుగా బిచ్చగాళ్లగా బాల కార్మికులుగా బ్రతుకుతున్న వారికి అండగా ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ "అండగా ఉంటుందని హెల్ప్ లైన్ CHILDLINE-1098 ద్వారా బరోసా ఇస్తామని సంస్థ అధినేత బి ఎస్ కోటేశ్వరరావు సూచించారు.

బాలల హక్కుల పరిరక్షణ "చైల్డ్ లైన్ సే దోస్తీ" వారోత్చవాలలో భాగంగా బుధవారం నాడు స్థానిక హనుమాన్ పేటలోని తానా భవనం వద్ద నుండి "రైడ్ ఫర్ సేఫ్ చైల్డ్ హుడ్" నినాదంతో బాల్యానికి బరోసా ఇస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల వద్దకు వెళ్ళి స్థానిక కార్పొరేటర్ ల ద్వారా ప్రజలతో  ముఖాముఖి ప్రచారం నిర్వహించారు.

తొలుత తానా భవనం వద్ధ ప్రచార పోస్టర్ ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కోటేశ్వరరావు ప్రసంగిస్తూ ఇటీవల కాలంలో  బాలల పై వేధింపులు బాలికల పై అత్యాచారాలు బాల్యవివాహాలు పెరిగిపోయాయని విజయవాడ కేంద్రంగా  గత 24 ఏళ్ల క్రితం ఆనాటి మేయర్ టి వెంకటేశ్వరరావు గారి చొరవతో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పడిన ఈ సంస్థ లక్షలాది మందికి ఆశ్రయం కల్పించడం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చేయగలిగామని వివరించారు.

 చైల్డ్ లైన్ -1098 సంచాలకులు నోయల్ హార్పర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు Malleswara Rao మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కోసం సంస్థ చేస్తూన్న కృషిని వివరించారు.

  కార్యక్రమంలో వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఫ్రాన్సిస్, జిల్లా బాలల సంరక్షణ అధికారి వై.  జాన్సన్ సామాజిక కార్యకర్త మోతుకూరి అరుణకుమార్, చైల్డ్ లైన్-1098 జిల్లా సమన్వయకర్త అరవ రమేష్, పి.నాగరాజు, K.శ్రీకాంత్, బర్డ్స్ సంస్థ ప్రతినిధి కే ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా స్థానిక కేదారేశ్వరపేట, పూర్ణానందంపేట ప్రాంతాల్లో స్థానిక 34,35 డివిజన్లు కార్పొరేటర్లు బండి పుణ్యశీల,  మనెమ్మ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వల్ల బాలబాలికలు చదువుకు దూరం అయ్యారని విద్యార్థుల చదువు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.

త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ కౌన్సిల్ లో బాలల పట్ల వివక్షత, వీధి బాలలు సమస్యపై చర్చ జరుపుతామని హామీ ఇచ్చారు.

న్యూ రాజ రాజేశ్వర పేట మునిసిపల్ పాటశాల అవరణలో జరిగిన కార్యక్రమంలో సింగ్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ పి అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులు రాబోయే రోజుల్లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని, బాల్యం నుండే చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.