చీకటిని పారదోలుతూ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి



- చీకటిని పారదోలుతూ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి 


- తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, నవంబర్ 3 (ప్రజా అమరావతి): చీకటిని పారదోలుతూ అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగను జాతి, కుల, మత, వర్గ విబేధాలను విస్మరించి సమైక్యంగా జరుపుకుంటారని చెప్పారు. ఈ ఏడాది దీపావళి తెలుగు ప్రజల కుటుంబాల్లో ఆనందాల సిరులు కురిపించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. టపాసులు కాల్చే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.

Comments