*జగనన్న విద్యా దీవెనతో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు*
*: జగనన్న విద్యా దీవెన కింద మూడవ విడత ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ము విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ*
*: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు*
అనంతపురం, నవంబర్ 30 (ప్రజా అమరావతి):
*రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అందించేందుకు వీలుగా జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తుండగా, ఐఐటి, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు ఈ పథకం అండగా నిలుస్తోంది. పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పేద విద్యార్థుల కోసం విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చి జగనన్న విద్యా దీవెన కింద పూర్తిస్థాయి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తుండగా, ఈ పథకం కింద ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొదటి విడత, జూలై నెలలో రెండో విడత, నవంబర్ నెలలో మూడో విడత రీయంబర్స్మెంట్ విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. విద్యా దీవెన కింద నాలుగో విడత ఫిబ్రవరి నెలలో తల్లుల ఖాతాలలో జమ చేయడం జరగనుంది. తల్లుల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయడం ద్వారా వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి కాలేజీలకు నేరుగా వెళ్లి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీల్లో వాస్తవాలను పరిశీలించి ఏవైనా లోటుపాట్లు ఉంటే యజమాన్యాలను ప్రశ్నించే అవకాశం ఏర్పడింది. దీని ద్వారా కాలేజీలలో జవాబుదారీతనం, కాలేజీలో స్థితిగతులు, పిల్లల బాగోగుల పై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతున్నాయి. ఉన్నత చదువుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేయకూడదని, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఎదురు చూడకూడదని చెప్పిన సమయానికి జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తూ వారి ఉన్నత చదువులకు ముఖ్యమంత్రి ప్రోత్సాహం అందిస్తున్నారు. మంగళవారం జగనన్న విద్యా దీవెన పథకం 2020-21 సంవత్సరమునకు సంబంధించిన మూడవ విడత కళాశాల ఫీజును అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా జమ చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం 2020-21 కింద మూడవ విడత కళాశాల ఫీజును అర్హులైన 92,237 మంది విద్యార్థులకు సంబంధించిన 82,957 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో 52.31 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినీలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.*
*1. రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు*
*: కె. అమృతాభాయి, ఇంటర్ సెకండియర్, కెఎస్ఎన్ జూనియర్ కాలేజ్, అనంతపురం టౌన్.*
జగనన్న విద్యా దీవెన పథకం కింద మూడో విడత పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అందించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాది కదిరి ప్రాంతంలోని నయనకోటతాండ, మా నాన్న కెమికల్ బిజినెస్ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాల ఫీజు కట్ట లేని పరిస్థితుల్లో జగనన్న విద్యా దీవెన పథకం ఎంతగానో ఆదుకుంటోంది. ఇంతకుముందు మొదటి, రెండవ విడత విద్యా దీవెన కింద లబ్ధి కలిగింది. ఇప్పుడు మూడో విడత కూడా అందించడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి పేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి ధన్యవాదాలు.
*2. జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం పట్ల సంతోషంగా ఉంది.*
*: ఎన్. రమ్య, సెకండ్ ఇయర్, కెఎస్ఎన్ జూనియర్ కళాశాల, అనంతపురం టౌన్.*
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మా నాన్న రైతు. ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కింద నాకు మూడు విడతలుగా లబ్ది కలిగింది. మా నాన్నకు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద లబ్ధి కలిగింది. మా తమ్ముడికి అమ్మఒడి వచ్చింది. మాలాంటి పేద విద్యార్థులను ముఖ్యమంత్రి ఎంతగానో ఆదుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తున్నారు. విద్యార్థుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి కృతజ్ఞతలు.
*3. పేద విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తున్నారు.*
*: కె. దివ్యాబాయి, సెకండ్ ఇయర్, కెఎస్ఎన్ జూనియర్ కళాశాల, అనంతపురం టౌన్.*
పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. మా నాన్న ఓ రైతు, మాది పాలసముద్రం వద్దనున్న బిఎన్ తాండా. ఉన్నత చదువులు చదివించాలంటే ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సమయంలో జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతగానో విద్యార్థులకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలు.
*4. చాలా సంతోషంగా ఉంది*
*: బి. ఉదయశ్రీ, బిఎస్సి సెకండియర్, కెఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అనంతపురం టౌన్.*
జగనన్న విద్యా దీవెన పథకం కింద మూడవ విడత ఫీజు రియంబర్స్మెంట్ అందించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. నాకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద లబ్ధి కలిగింది. మా నాన్న ట్రాక్టర్ కంపెనీలో పనిచేస్తు మమ్మల్ని చదివిస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు విద్యా దీవెన పథకం అండగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాలాంటి విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ప్రోత్సహించడం మరువలేనిది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు జగనన్న పథకాలు ఆదర్శంగా ఉన్నాయి. మా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సీఎం జగనన్నకు కృతజ్ఞతలు.
addComments
Post a Comment