వరద ప్రాంతాల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణ - నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్

 వరద ప్రాంతాల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణ


- నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్



నెల్లూరు నవంబర్ 23 (ప్రజా అమరావతి);

పెన్నానది వరదలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపడుతున్నామని కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక వెంకటేశ్వర పురం, జనార్ధన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ, గాంధీ గిరిజన కాలనీ తదితర ప్రాంతాల్లో కమిషనర్ మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వరద నీరు తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేస్తున్నామని, బురదమయమైన అన్ని ప్రాంతాలను శుభ్రం చేస్తున్నామని తెలిపారు. వరద నీరు నిల్వ ఉన్న కొన్ని ప్రాంతాల్లో మోటర్ల ద్వారా తోడివేస్తున్నామని, రోడ్లకు అడ్డంగా పడి ఉన్న వృక్షాలు, వరదకు కొట్టుకు వచ్చిన చెత్త, తదితర వ్యర్ధాలను పూర్తి స్థాయిలో తొలగించేలా సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. అంటురోగాలు వ్యాపించే అవకాశాలు ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ లో భాగంగా అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించి, దోమల నివారణకై ఫాగింగ్ చేయిస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments