భీమిలిలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తాం : ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 

అమరావతి (ప్రజా అమరావతి);భీమిలిలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తాం : ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

*నైపుణ్య యువతలో ఆంధ్రప్రదేశ్ ఆధిక్యం :  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రెండు సంస్థలు*


*డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి.. వాటిపైన చర్చించాం*


*ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ(ఏపీఐఎస్)- అర్త్యాన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్;  ఏపీఈఐటీఏ-  నేషనల్ రీసెర్చ్ డిజైన్ కార్పొరేషన్ (ఎన్ఆర్డీఎస్) ల మధ్య అవగాహన ఒప్పందం*


*సుమారుగా రెండు వేల పైబడి ఉపాధి కల్పించే సంస్థలు, పరిశ్రమలకు కస్టమ్స్ సహా  పలు రాయితీలు ఇస్తాం*


ఇప్పటికే పలు పరిశ్రమలకు రాయితీలు చెల్లించాం


ఐ.టీ పరిశ్రమలకు రూ. 30 కోట్లు మాత్రమే బకాయిలు


అవి కూడా త్వరలో చెల్లిస్తాం


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని  రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్య,పరిశ్రమల రంగాలలో కీలక సంస్కరణలు చేపట్టింది


రక్షణ రంగంలో పెట్టుబడులకు అవకాశాల గురించి చర్చించే వేదికను ఏర్పాటు చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు


సహజవనరుల సమాహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం


ఏపీలో మానవవనరులు పుష్కలం


నైపుణ్యం గల యువతీయువకులు మా బలం


పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ నిలయం


సకల సదుపాయాలతో దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం కలిగి ఉండడం ఏపీకి వరం


దేశ జీడీపీలో ఏపీ వాటా 5 శాతం


ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనదే అగ్ర స్థానం


వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏపీ సుపరిపాలన, పారదర్శకత, సుస్థిరాభివృద్ధి, నైపుణ్యం, రాష్ట్ర నలుమూలకు ప్రజా సంక్షేమంతో సత్తా చాటుతోంది


విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యతనిస్తోంది


ప్రతి పౌరుడు మీద ప్రభావం చూపే, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఎదిగే వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం


వ్యవస్థాగత నిర్మాణం,సరకు రవాణా, రహదారుల అనుసంధానం, నైపుణ్యం, రాష్ట్రంలో ప్రతి మారుమూల రోడ్డు, ఈ-గవర్నెన్స్, ఇంటర్నెట్ వంటి అంశాలలో భవిష్యత్తులో దేశంలోనే ఏపీ బెస్ట్ అనిపించుకుంటుంది


యువతకు అవసరమైన విద్య, నైపుణ్యం సహా ఉపాధి అవకాశాల వరకూ ఆర్థికంగా అండగా నిలవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి మాటల్లో చెప్పలేనిదిఐ.టీ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్ వేదికగా సోమవారం జరిగిన "దేశీ -2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ వర్క్ షాప్" కు హాజరైన ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, వర్చువల్ గా హాజరైన డీఆర్డీవో చైర్మన్ సతీష్ రెడ్డి, వివిధ రంగాల ప్రముఖులుComments