నీతీ ఆయోగ్ బృందం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె. నివాస్


నీతీ ఆయోగ్ బృందం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె. నివాస్. 


          గన్నవరం, నవంబర్, 30 (ప్రజా అమరావతి):  జిల్లాలో ప్రకృతి వ్యవసాయంను పరిశీలించేందుకుగాను  రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేస్తున్న నీతీ ఆయోగ్ బృందం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె. నివాస్ మంగళవారం పరిశీలించారు.  ముందుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని, విమానాశ్రయ అధికారులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.   ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ నీతీ ఆయోగ్ బృందం సభ్యులు ఈనెల 1వతేదీన  కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం ఉదయం 10 గంటలకు  చేరుకొని 12 గంటల వరకు తెల్లం విజయ్ కుమార్ తో సమావేశమై  ప్రకృతి వ్యవసాయమునకు సంబందించిన అంశాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం వీరపనేనిగూడెంలో   ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారన్నారు.  ముందుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని, విమానాశ్రయ అధికారులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం వీరపనేనిగూడెం చేరుకొని గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఆ గ్రామంలో నీతీ ఆయోగ్ బృందం పాల్గొనే కార్యక్రమాలకు సంబందించిన ఏర్పాట్లను పరిశీలించారు. 

              జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవీలత, ఎల్. శివశంకర్, నూజివీడు రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ కె. రాజ్యలక్ష్మి, తహసీల్దార్ సి.హెచ్. నరసింహారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.