శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి): 

రోో దేవస్థానము శ్రీ ప్లవ నామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భవానీ మండల దీక్షా కార్యక్రమము (మాలాధారాణ) ప్రారంభించబడినది. ఈరోజు ఉదయం ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు మరియు వైదిక కమిటీ సభ్యులు శ్రీ లింగంభోట్ల దుర్గాప్రసాద్ గారు, శ్రీ ఆర్.శ్రీనివాస శాస్త్రి గారు, శ్రీ కోటా ప్రసాద్ గారి  ఆధ్వర్యములో శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు  అమ్మవారి ఆలయము లోని శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద పూజా కార్యక్రమములు నిర్వహించి, శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తిని  ఊరేగింపుగా మహామండపము 6 వ అంతస్తు లోని భవానీ దీక్షా మండపము నకు తీసుకొని వచ్చి, గణపతి పూజతో పూజా కార్యక్రమములు ప్రారంభించి, పుణ్యా హవచనము, మండపారాధన, కలశస్థాపన చేసి శ్రీ అమ్మవారిని ఆవాహన చేయడము జరిగినది. ఈ కార్యక్రమములో  శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు పాల్గొని అత్యంత భక్తిశ్రద్దలతో శాస్త్రోక్తముగా పూజా కార్యక్రమములు నిర్వహించారు. అనంతరం  కార్యనిర్వహణాధికారి వారు, స్థానాచార్యుల వారు, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు భవానీ దీక్షల గోడ పత్రములను(Posters) ఆవిష్కరించారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీ లింగంభొట్ల దుర్గాప్రసాద్ గారు భవానీ భక్తులకు మండల దీక్షాధారణ చేసి కార్యక్రమమును ప్రారంభించారు. అనంతరం దీక్షా పీటము నందు ఆలయ ఉప ప్రధానార్చకులు శ్రీ యద్దనపూడి నాగరాజు శాస్త్రి గారు మరియు అర్చకులు శ్రీ యణమండ్ర ఉమాకాంత్ శర్మ గారు ఆచార్య గురు భవానీలుగా దీక్ష చేపట్టే భవానీ భక్తులకు శ్రీ అమ్మవారి మాలాధారణ చేయనున్నారు. ఈ మండల దీక్ష మాలాధారణ కార్యక్రమము ఈరోజు నుండి ది: 19-11-2021 వరకు (కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు) నిర్వహించబడును. అనంతరం ది.05-12-2021 నుండి ది: 09-12-2021 వరకు (మార్గశిర శుద్ధ విదియ నుండి మార్గశిర శుద్ధ షష్టి వరకు) అర్ధమండల దీక్ష కార్యక్రమము నిర్వహించబడును. ది.18-12-2021 న మార్గశిర పౌర్ణమి సందర్భముగా సా.06 గం.ల నుండి కలశ జ్యోతులు ఉత్సవము నిర్వహించబడును. అనంతరం ది.25-12-2021 నుండి ది.29-12-2021 వరకు (ది. 25-01-2021  ఉదయం అగ్నిప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభం) దీక్షా విరమణ మహోత్సవం నిర్వహించబడి, ది.29-01-2021  ఉదయం 10.30 గం.లకు మహా పూర్ణాహుతి కార్యక్రమముతో భవానీ దీక్షల కార్యక్రమము సమాప్తి అగును.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image