శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ మనవాళ మహాముని సాత్తుమొర.
తిరుపతి (ప్రజా అమరావతి):
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మనవాళ మహాముని ఆలయంలో సోమవారం సాత్తుమొర జరిగింది.
అక్టోబరు 30న ప్రారంభమైన శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఈ సందర్భంగా ఉదయం శ్రీ మనవాళ మహాముని ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీమనవాళ మహాముని ఆలయానికి వేంచేపు చేశారు.
అనంతరం తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకువచ్చిన అప్పాపడిని తెచ్చి శ్రీ మనవాళ మహాముని వారికి సమర్పించారు. అనంతరం ప్రబంధపారాయణం, శాత్తుమొర నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కామరాజు పాల్గొన్నారు.
addComments
Post a Comment