మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పనులపై ఏడుగురు జిల్లా రిసోర్స్ పర్సన్స్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలుకొవ్వురు (ప్రజా అమరావతి);


కొవ్వూరు మండల పరిధిలో ముగిసిన రెండు ఆర్ధిక సంవత్సరాలు కాలంలో రూ.6.99 కోట్లతో  చేపట్టిన 4,022 మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పనులపై ఏడుగురు జిల్లా రిసోర్స్ పర్సన్స్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలు


నిర్వహించడం జరిగిందని డ్వామా ప్రోజెక్టు డైరెక్టర్ డి. రాంబాబు పేర్కొన్నారు. సంబంధించిన పనులను డోర్ టూ డోర్ సందర్శించి వేతనాలు చెల్లింపు, రోడ్లు తదితర పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ లు చేపట్టారన్నారు. ఆయా పనులపై అభ్యంతరాలు, అభియోగాలు పై చేర్చించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.సోమవారం స్థానిక ఎమ్ పి డి ఓ కార్యాలయం ఆవరణలో కార్యక్రమం  కార్యక్రమంలో ఎంపిటిసి కాకర్ల సత్యనారాయుడు, జెడ్పిటిసి బి. వెంకటలక్ష్మి సమక్షంలో నివేదిక పై ప్రజా వేదిక ముందు ఉంచారు. 


ఈ సందర్భంగా కొవ్వూరు జెడ్పిటిసి బి. వెంకటలక్ష్మి, ఎంపిటిసి కాకర్ల సత్యనారాయుడు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులు ద్వారా 2019-20 ఆర్ధిక  సంవత్సరం లో 2245 పనుల ద్వారా రూ.4.08 కోట్లు వేజ్ కాంపోనెంట్ , రూ..6.79 కోట్ల మెటీరియల్ కాంపౌనెంట్ పనులను, 2020-21 ఆర్ధిక  సంవత్సరం లో 1777 పనుల ద్వారా రూ.5.30 కోట్లు వేజ్ కాంపోనెంట్ , రూ. 9.18  కోట్ల మెటీరియల్ కాంపౌనెంట్ పనులను చేపట్టడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఇంత ఎత్తున ఉపాధిహామీ పనులు చేపట్టడం ద్వారా ఈ ప్రభుత్వం పేదల పక్షాన్న నిలిచిందని పేర్కొన్నారు.డ్వామా పీడీ డి. రాంబాబు మాట్లాడుతూ, కోవిడ్ వలన గత రెండు సంవత్సరాలుగాసామాజిక తనిఖీలు  చేపట్టలేక పోవడం తో ఒకేసారి తనిఖీలు గత 13 రోజులు గా నిర్వహించామన్నారు.  కొవ్వూరు మండలం పరిధిలో ది.1.4.2019 నుంచి ది.31.3.2020 మరియు ది.1.4.2020 నుంచి ది.31.3.2021 వరకు జరిగిన రెండు ఆర్ధిక సంవత్సరాలలో  "ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ "  పనులపై ది. 8.11 2021 నుంచి ది.21.11.21 వరకు సామాజిక తనిఖీ నిర్వహించామన్నారు. సామాజిక తనిఖీల్లోని వివరాలను ప్రజా ప్రతినిధులు , కాంట్రాక్టర్లు సమక్షంలో  ప్రజా వేదిక ద్వారా ప్రజల ముందుసోమవారం  ఉంచడంజరిగిందని రాంబాబు పేర్కొన్నారు. 2019-20, 2020-21 రెండు సంవత్సరాలలో లేబర్ , మెటీరియల్ కంపోనెంట్ కింద రూ.16.18 కోట్ల పనులు పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. మొత్తం మండలం పరిధిలోని 16 గ్రామాల్లో ఏడుగురు జిల్లా రిసోర్స్ పర్సన్స్ నవంబర్ 8 నుంచి 21 వరకు పర్యటించి సామాజిక తనిఖీ విజయవంతం గా పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో గ్రామ గ్రామానికి , ఇంటింటి కి వెళ్లి చేసిన పనుల కు వేతనాలు అందాయా, ఉపాధి హామీ, పధకం, గృహనిర్మాణం,  ఆర్ డబ్ల్యూఎస్,  ఆర్ అండ్ బి , సర్వశిక్షా అభియాన్, వెలుగు, పశుసంవర్ధక శాఖల ద్వారా చేపట్టిన భవనాల , రోడ్ల నిర్మాణం తదితర పనులు సక్రమంగా జరిగాయా అని తనిఖీలు నిర్వహించారన్నారు. వాటిపై వొచ్చిన అభ్యంతరాలు, అభియోగాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక త్వరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.


ఈ సమావేశంలో   కొవ్వూరు జెడ్పిటిసి బి. వెంకటలక్ష్మి, ఎంపిటిసి కాకర్ల  నారాయుడు, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ కెవికె అప్పల నాయుడు, ఇంఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి, తణుకు ఏపిడి కె. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.