కొవ్వూరు (ప్రజా అమరావతి);
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
కొవ్వూరు డివిజన్, కొవ్వూరు నియోజకవర్గం- 54 (ఎస్సి ) పరిధిలో నవంబర్ 20, 21 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని ఆర్డీవో ఎస్.మల్లిబాబు, కొవ్వూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి బి. నాగరాజు నాయక్ లు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు.. ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటి ఓటును.. కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. ఇందుకోసం సంబంధించిన ఎన్నికల బూత్ లెవెల్ అధికారులు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శని , ఆది వారాల్లో అందుబాటులో ఉండడం జరుగుతుందన్నారు. 01.01.2021 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక ఓటరు నమోదు తేదీల్లో బీఎల్‌వోలు పోలింగ్ కేంద్రాల వద్ద సంబంధిత అన్ని పత్రాలతో అందుబాటులో ఉండాలనిమల్లిబాబు స్పష్టం చేశారు. కొత్తగా ఓటు నమోదుతో పాటు తొలగింపు, మార్పులు, చేర్పులు..అన్ని రకాలకు సంబంధించి దరఖాస్తులను ఆయా కేంద్రాల వద్ద స్వీకరించడం కోసం ఏర్పాట్లు పూర్తి చేసామని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు.
ప్రజల్లో ఓటరు నమోదుపై సంబంధిత అధికారులు విస్తృత ప్రచారం చేయాలని తహసిల్దార్ బి.నాగరాజు నాయక్ సూచించారు. నెం.54 కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధి లోని ప్రజలు ఓటరు నమోదు కార్యక్రమం లో పాల్గొని ఓటు హక్కు కై దరఖాస్తు చేసుకోగలరని విజ్ఞప్తి చేసారు. జనవరి 15న ఓటరు తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.
addComments
Post a Comment