అమరావతి (ప్రజా అమరావతి);
*గత ఏడాది విజయవాడ హనుమాన్‌పేటలో ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కొల్పోయిన చిన్నారి కుటుంబాన్ని ఆదుకున్న సీఎం శ్రీ వైఎస్ జగన్*
*సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన చిన్నారి తల్లిదండ్రులు*
*రూ. 10 లక్షల ఆర్ధిక సాయం, చిన్నారి సోదరుడికి అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ప్రకటించిన సీఎం. వెంటనే రూ. 10 లక్షల చెక్ అందజేసిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు*
*కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన వీరమల్ల పెద్ద జమలయ్య, ఏసమ్మల కుమార్తె చిన్నారిని విజయవాడ హనుమాన్‌పేటలో గత ఏడాది అక్టోబర్‌లో అదే గ్రామానికి చెందిన నాగభూషణం పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి కుటుంబ పరిస్ధితిని మహిళా కమీషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. రూ. 10 లక్షల చెక్‌ను వెంటనే ఇవ్వాలని ఆదేశించడంతో, సీఎంవో అధికారులు భాదిత కుటుంబానికి చెక్ అందజేశారు. అంతేకాక మృతురాలి సోదరుడికి కూడా వెంటనే అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగాన్ని కల్పిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎంవో అధికారులను సీఎం శ్రీ వైఎస్ జగన్ ఆదేశించారు.*
addComments
Post a Comment