కొవ్వూరు (ప్రజా అమరావతి);
కొవ్వూరు రెవెన్యూ డివిజన్ నందు జగన్న సంపూర్ణ గృహ హక్కు సంబంధించి సుమారు 1200 లబ్ధిదారులు OTS (వన్ టైం సర్దుబాటు) క్రింద రుణము చెల్లించియున్నారని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు 50 శాతం ప్రభుత్వ సబ్సిడీ తో కూడి 1981-2021 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇళ్ళు నిర్మించి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నిరుపేదల కి ఆ ఇంటిపై సర్వహక్కులు కల్పించే దిశగా , వారి పేరునే రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒక సువర్ణ అవకాశం
కల్పించిందని మల్లిబాబు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ని వారు కేవలం రూ.10 వేలు లేదా బాకిఉన్న రుణం ఏది తక్కువ అయితే ఆ మొత్తంచెల్లించేందుకు ఒక సువర్ణ అవకాశం అన్నారు. ఇంటి రుణమాఫీ చెయ్యడమే కాకుండా వారి పేరునే రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని 7200 లబ్ధిదారులు ప్రయోజనం పొందేందుకు అంగీకారాన్ని తెలిపి ఉన్నారని, వీరిలో 1200 మంది అధికారులు సూచించిన మొత్తం చెల్లించి నట్లు తెలిపారు. ఇంకను సుమారు 6000 మంది లభ్డిదారులు చెల్లించవలసియున్నాదని, .కావున మిగిలియున్న లభ్డిదారులు వెంటనే సంబంధించిన మొత్తాన్నీ చెల్లించి, చ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకము సద్వినియోగము చేసుకొన వలసినదిగా రెవెన్యూ డివిజినల్ అధికారి, కొవ్వూరు వారు కోరియున్నారు.
పేద, నిరుపేద కుటుంబాలకు స్వంత ఇంటిపై రిజిస్ట్రేషన్ పత్రాలు పొందేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం అని తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ పు.జగదాంబ లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు పొందడం వల్ల భవిష్యత్ లో బ్యాంకులనుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ పధకం ద్వారా లబ్దిపొందిన లబ్ధిదారుల మనోగతం.
1996-97 హౌసింగ్ స్కీం కింద రూ.10 వేలు రుణం తీసుకున్నానని ఐ.పంగిడి గ్రామం. కూనిశెట్టి.సుబ్బలక్ష్మి తెలిపారు. వడ్డీతో కలిపి రూ.17 వేలు చెల్లిం చాలని బ్యాంకు వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. జగనన్న ప్రభుత్వం ఒకేసారి చెల్లింపు చేస్తే సరిపోతుందని తెలపడంతో, వాలంటీర్ మాటలను నిర్దారణ చేసుకునేందుకు తహసిల్దార్, ఎంపిడివో లను కలువగా మొత్తం రూ.5400 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వెంటనే అమొతాన్ని చెల్లించి, తన ఇంటిపై సంపూర్ణ హక్కులను పొందడం ఎంతో ఆనందం గా ఉందని సుబ్బలక్ష్మి తెలిపారు.
వేములూరు గ్రామాం ఎస్సి పేట 9వ వార్డు కు చెందిన వార చంద్రకాంతం 1992 లో హౌసింగ్ బోర్డ్ ద్వారా ఇంటిని రూ.9 వేల ఋణంపై నిర్మించు కొన్నానని తెలిపారు. సబ్సిడీ పోను అసలు బ్ రూ.4500 వేలు మరియు వడ్డీ వాయిదా లు చెల్లించాల్సి ఉన్నా, కొందరు మాటలు విని అప్పు చెల్లించలేదని,బ్యాంకు వాళ్ళు మొత్తం అసలు వడ్డీరూ.12 వేలు చెల్లిస్తేనే తప్ప కుదరదని చెప్పారు. ఐతే జగనన్న ఓ టి ఎస్. ద్వారా కేవలం రూ. 5400/- చెల్లిస్తే సరిపోతుందని మండల అభివృద్ధి అధికారి జగదాంబ గారు తెలపడం జరిగిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ నా సమస్య ఈరోజు పరిష్కారం అయినదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి ఒక్క లబ్దిదారుడు తమలాగే ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం గమనార్హం..
addComments
Post a Comment