తొమ్మిది నామినేషన్లు దాఖలుకొవ్వూరు (ప్రజా అమరావతి);  కొవ్వూరు డివిజన్ పరిధిలో ఎన్నికలు జరగనున్న 5 గ్రామ వార్డు లకి   తొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు ఆర్డీవో ఎస్. మల్లిబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.


కొవ్వూరు డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన 5 గ్రామ వార్డులకు జరిగే ఎన్నికల కోసం  చాగల్లు మండలం ఎస్. ముప్పవరం గ్రామంలో 3వ వార్డుకి (ఇద్దరు), గోపాలపురం లో చెరుకుమిల్లి గ్రామంలో 7వ వార్డుకి (ఒకరు), కొవ్వూరు లో కాపవరం గ్రామంలో 9వ వార్డుకి (ఇద్దరు) , పెరవలి మండలం లో అన్నవరప్పాడు గ్రామంలో 12వ వార్డుకి (ఒకరు) ;  మల్లేశ్వరం గ్రామంలో 8వ వార్డు కి (ముగ్గురు) అభ్యర్థులు  నామినేషన్లు దాఖలు చేశారు


  నవంబర్ 6న నామినేషన్లు పరిశీలిన, 7వ తేదీ అభ్యంతరాలపై పరిశీలన, 8వ తేదీన అర్హత సాధించిన నామినేషన్లు జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. 9వ తేదీ 3 గంటల వరకు  నామినేషన్లు ఉపసంహరణ కి అవకాశం ఉండడంతో, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ను  గురువారం సా.3 తర్వాత ప్రకటిస్తారన్నారు. 16వ తేదీ ఉదయం 7 నుండి సా.5 వరకు పోలింగ్, రిపోలింగ్ కి  17 వతేది ను రిజర్వుడ్ గా ఉంచారు. నవంబర్ 18వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని పేర్కొన్నారు.