కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా కు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి.

 కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా కు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి.


రేణిగుంట విమానాశ్రయం, నవంబర్,13 (ప్రజా అమరావతి)






:


కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ నెల 14 వ తేదీన తిరుపతి తాజ్ హోటల్ లో నిర్వహించనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనే నిమిత్తం శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్ఛాన్ని అందించి ఆహ్వానం పలికారు.


 ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి,మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి,జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ,తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి,టి టి డి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి,తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, సత్యవేడు, పూతలపట్టు  నగరి ఎమ్మెల్యేలు ఆదిమూలం,ఎం ఎస్ బాబు ,రోజా,డీజీపీ గౌతమ్ సవాంగ్,డీఐజీ కాంతిరాణా టాటా, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష,ఆర్డీఓ కనక నరసారెడ్డి,బిజెపి నాయకులు సీఎం రమేష్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి శాంతారెడ్డి కోలా ఆనంద్ భాను ప్రకాష్ రెడ్డి సామాను శ్రీనివాసులు తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి సాదర స్వాగతం పలికారు .


ఈ కార్యక్రమంలో రేణిగుంట తహసిల్దార్ శివ ప్రసాద్, విమానాశ్రయ డైరెక్టర్ సురేష్,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments