డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టిరేపే  'దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక రోజు వర్క్ షాప్' : ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


*డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంపై  ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టి* *పాల్గొననున్న డీఆర్డీవో వంటి ప్రభుత్వ రంగ సంస్థలు*


అమరావతి, నవంబర్,28 (ప్రజా అమరావతి);  విశాఖపట్నంలో సోమవారం 'దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక రోజు వర్క్ షాప్' ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ ఏర్పాటు చేస్తోందని ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)తోపాటు  ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ప్రధానంగా ఈ వర్క్ షాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాటనుంది. ఈ వర్క్ షాప్ లో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సహా పలు కీలక ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు అనేక దేశీయ, విదేశీ సంస్థలు పాల్గొననున్నాయి. హోటల్ రాడిసన్ బ్లూలో ఉదయం  ఈ వర్క్ షాప్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమరెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించనున్నారు. 


-----------