భారీవర్షాలలో కాకాణి పర్యటన"

 *"భారీవర్షాలలో కాకాణి పర్యటన"*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


పిన్నేరు వాగు వరద ప్రవాహాన్ని పరిశీలించి, అధికారులు, స్థానిక ప్రజలతో కలిసి వరద ఉధృతి పై సమీక్షించిన ఎమ్మెల్యే కాకాణి.


కండలేరు రిజర్వాయర్ కట్ట పటిష్టంగా ఉన్నందున ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.


కండలేరు రిజర్వాయర్ కట్ట భద్రతపై ఎవ్వరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని, వదంతులు నమ్మవద్దని మనవి చేస్తున్నా.


మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో బస చేస్తున్న వారిని పలకరించి, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.


పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాల గురించి ఆరా తీసి, సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకాణి.


పునరావాస కేంద్రాలలో వృద్ధులు, గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లలు ఉంటున్నందున మందులు అందుబాటులో ఉంచి, అవసరమైన వైద్య సదుపాయాలు అందించవలసిందిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుబ్బరాజు, వైద్య సిబ్బందిని కోరిన ఎమ్మెల్యే కాకాణి.


పునరావాస కేంద్రంలో ఉన్నవారికి అవసరమైన తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచి, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టవలసిందిగా పంచాయతీ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను కోరిన ఎమ్మెల్యే కాకాణి.


వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించి, సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చిన యన్.డి.ఆర్.ఎఫ్. (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) అధికారులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కాకాణి.


మండల స్థాయిలోని అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వరద సమయంలో చురుకుగా పనిచేసి, ప్రాణనష్టం జరగకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.


పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్పందించి, సహాయక చర్యలు చేపట్టిన తీరు భేషుగ్గా ఉందని అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.

Comments